NTV Telugu Site icon

Perni Nani : రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర.. చంద్రబాబుది శకుని మెదడు

Perni Nani Satires On Brs

Perni Nani Satires On Brs

చంద్రబాబు అధికారం కోసం ఎంత చెడ్డ పని చేయటానికి అయినా ఒడికడతాడని అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు మరింత బరితెగింపు చూపిస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే 10 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయినా పర్వాలేదు అనే రౌడీయిజం చంద్రబాబు చేస్తున్నారని, పోలీసుల పై దాడులు చేసి అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నాడని పేర్ని నాని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర పన్నాడు చంద్రబాబు అని, చంద్రబాబుది శకుని మెదడంటూ ఆయన మండిపడ్డారు.

Also Read : NC 23: జాలరిగా నాగచైతన్య.. అమాంతం అంచనాలు పెంచేస్తున్న ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్

టీడీపీకి మరోసారి వాత పెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని అన్నారు. 1995 నుండి రాయలసీమకు నీళ్లివ్వకుండా చంద్రబాబు ఏం చేశారు? అని ప్రశ్నించిన పేర్ని నాని… అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తాననడం విడ్డూరంగా ఉందని హెద్దేవా చేశారు. 35 ఏళ్లుగా గెలుస్తోన్న తమ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా మొగాడే అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం ఏది? అంటే ఏం చెబుతారన్నారు నాని. చంద్రగిరిలో గెలిచారా? కుప్పంలో ఎందుకున్నారని నిలదీశారు. అంతేకాకుండా.. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పేర్ని కౌంటర్ ఇచ్చారు. దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుందని, చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఎప్పుడైనా అడిగారా?? అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి నా అభిమాన నటుడు అని వ్యాఖ్యానించారు పేర్ని నాని.. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారు? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Alia Bhatt: ‘వండర్ విమెన్’ కు తెలుగు నేర్పిన అలియా.. మీకు నా ముద్దులు అంటూ రచ్చ

‘ఇన్నేళ్ళల్లో ఏ రాజకీయ పార్టీ కూడా పోలీసుల పై దాడి చేసిన ఘటనలు జరుగలేదు. చంద్రబాబుకే కాదు ఏడాది వయసు ఉన్న మనవడికి కూడా పోలీసులే భద్రత కల్పించాలి. మళ్ళీ అదే పోలీసుల పై చంద్రబాబు దాడులు చేయిస్తాడు. పోలీసుల పై వాడికి కుట్రదారుడు చంద్రబాబే. పేర్ని నాని ఇక్కడే బతుకుతున్నాడు… చస్తే శవాన్ని ఇక్కడే పూడుస్తారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉండడు… చస్తే శవం కూడా ఇక్కడికి రాదు. పోలీసులు లేకపోతే వీళ్ళకు భయం. లోకేష్ పోలీసుల సంగతి చూస్తాడట. పోలీసులు లేకపోతే గడప దాటి అడుగు కూడా పెట్టలేడు. ఎస్పీ రిషాంత్ రెడ్డి కళ్ళకు ఆపరేషన్ చేస్తాననటం లోకేష్ బలుపు. పోలీసోడికి కులం ఉంటుందా? పుంగనూరు మారణకాండలో చంద్రబాబును మొదటి ముద్దాయిగా పరిగణించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.’ అని పేర్ని నాని అన్నారు.

Show comments