Perni Nani: అందుకే వంశీని 115 రోజులుగా జైల్లో ఉంచారు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారు
- ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు
- ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారు
- కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు
- వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. కృష్ణా జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు.. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని.. వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు.. న్యాయస్థానాల్లో అంతిమంగా న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. చివరికి కూటమి ప్రభుత్వం దిగజారి మానవత్వం కూడా మరచి ఆరోగ్యాన్ని క్షీణింప జేయాలని దుర్బుద్ధితో ఇంత తతంగం నడుపుతున్నారని విమర్శించారు.. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లగానే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.. అచ్చెన్నాయుడు పైల్స్ వస్తాయి.. వంశీ విషయంలో మాత్రం కోర్టుల నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి వచ్చిందని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.. ఏదో రకంగా బలి చేయాలని కస్టడీల మీద కస్టడీలకు తీసుకుంటున్నారన్నారు..
READ MORE: Operation Sindoor: భారత్ కొన్ని విమానాలు నష్టపోయింది, సరిదిద్దుకుని తిరిగి దాడి చేశాం: సీడీఎస్..
Also Read
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
- Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
- GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
ఆయన పరిస్థితి విషమించి కింద పడిపోయినా ఆరోగ్యం బాగానే ఉందని అని సర్టిఫికెట్ తీసుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. “అచ్చెన్నాయుడు మాత్రం పైల్స్ కోసం రమేష్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటారు.. చంద్రబాబు బాగాలేదని బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చి ఒక్కరోజు కూడా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోలేదు.. బయటకు వచ్చాక రాజకీయాలు మానలేదు.. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు యముడి పాత్రలో ఉంటే సతీ సావిత్రి పాత్రలో వంశీ భార్య పోరాటం చేస్తుంది.. ఈ తప్పుడు కేసుల్లో మహా అయితే ఇంకొక పది రోజులు జైలులో పెట్టగలరు.. వంశీ బయటకు వస్తాడు.. గన్నవరం నుంచే తన పోరాటాన్ని చేస్తాడు.. గన్నవరం వచ్చి కార్యకర్తలకు దైర్యం చెప్పాలని వచ్చాం.. ఇక్కడి కార్యకర్తలు మాత్రం వంశీ అండగా ఉండే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.. అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు ప్రజలను దగా చేశారు.. నాడు ఎన్టీఆర్ కు ఎలా వెన్నుపోటు పొడిచారో మోసపు హామీలతో ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు.. ప్రజలకు ఒక్క హామీ కూడా నెరవేర్చిండా రాజకీయాలు చేస్తున్నారు.. ఇలాంటి పాలకులను ఎన్నుకోవటం రాష్ట్ర ప్రజల దురదృష్టం.. గన్నవరం లోనే మిన్నగా వెన్నుపోటు కార్యక్రమం చేస్తాం.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇచ్చినవి మొత్తం తప్పుడు రిపోర్టులు అని అర్థమైంది..” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Kavitha: హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత
ధర్మంగా వైద్యం చేయాల్సిన వైద్యులు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. హైకోర్టు న్యాయస్థానం వల్లే ఆయన ప్రాణాలతో బయటకు రాగలిగే పరిస్థితి.. 5న ఆయుష్ ఆస్పత్రి న్యాయస్థానానికి హెల్త్ బులెటిన్ ఇస్తుందన్నారు.. వంశీని కుట్రలు, కుతంత్రాలతో తుదముట్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.. వంశీనే గన్నవరం ఇంచార్జ్ గా ఉంటారని.. లోకేష్ మీ రెడ్ బుక్ మడిచి ఎక్కడైనా పెట్టుకోవాలన్నారు.. మీకు చేతనైన పని చేసుకో.. ఇంతకన్నా మమ్మల్ని ఏం చేస్తామని చెప్పారు.. వైసీపీ నేతల్ని జైలులో పెట్టించి మీరు సాధించేది ఏదీ లేదని.. కనీసం వైసీపీ కార్యకర్తల కళ్ళల్లో భయం చూడగలిగారా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తిరుమల వెంకన్న సహా అందరికీ కష్టాలు మొదలయ్యాయని.. ఏపీలో దేవుడి ఆస్తులు వల్ల పార్టీ నేతలకు పప్పుబెల్లాల్లా పంచుతున్నారన్నారు.. 10 తరగతి మూల్యాంకనం ఆ శాఖ మంత్రి పనితీరుకు నిదర్శనమని.. ఆయన చేతకాని తనం వల్ల ముక్కు పచ్చలారని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..