NTV Telugu Site icon

Health Tips: షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు ఈ తప్పులు చేయకండి.. లేదంటే కష్టమే..!

Diabetes

Diabetes

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే.. ఈ వ్యాధి నివారణ గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి.. జీవనశైలి, ఆహారం రెండూ చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. ఇందులో డైట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మీరు తినేవి.. తిననివి మీ చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మధుమేహం అనేది ఒక వ్యాధి.. ఈ వ్యాధి పట్ల ఏ మాత్రం అజాగ్రత్త వహించినా అనేక సమస్యలకు దారి తీస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు లేదా వచ్చే ప్రమాదం ఉన్నవారు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.

Giorgia Meloni: ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పరిష్కరించగలదు.. ఇటలీ ప్రధాని కామెంట్స్..

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
డయాబెటిస్‌ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోకపోవడం, అవసరమైన మందులు తీసుకోకపోవడం సమస్యను మరింత పెంచుతుంది. అంతే కాకుండా.. రోజువారీ దినచర్యకు సంబంధించిన కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.

చక్కెర మాత్రమే కాదు.. ఇవి కూడా హానికరం
చక్కెరతో తయారు చేయబడిన పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. డయాబెటిస్‌ ఉన్న వాళ్లు తీపి పదార్థాలను నివారించడం చాలా ముఖ్యం. ఇది ఒక్కటే సరిపోదు. బర్గర్లు, పిజ్జా, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌ తగ్గించాలి. ఎందుకంటే.. వీటిల్లో అధిక మొత్తంలో కొవ్వు, చక్కెర ఉంటాయి. ఇవి అసాధారణంగా అధిక చక్కెర స్థాయిలకు దారితీస్తాయి. మీరు వీటిని ఎక్కువగా తీసుకుంటే.. మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

శారీరక శ్రమ లేకపోవడం
రెగ్యులర్ వ్యాయామం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంతేకాకుండా.. బ్లడ్ షుగర్ ను మెరుగ్గా నియంత్రిస్తుంది. ఒకవేళ వ్యాయామం చేయకపోతే మధుమేహం సమస్యలను పెంచుతుంది. మీకు మధుమేహం ఉన్నా, లేకపోయినా క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వ్యాయామం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. అలాగే.. మధుమేహ ప్రమాదం నుంచి తగ్గిస్తుంది.

అధిక ఒత్తిడి తీసుకోవద్దు
మధుమేహ వ్యాధిగ్రస్తులు అధిక ఒత్తిడి తీసుకోవద్దు. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఒత్తిడి సమయంలో శరీరంలో ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) స్థాయి పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ క్రమంలో.. యోగా, ధ్యానం, సరైన నిద్ర వంటి ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవాలి. తగినంత నిద్ర ఒత్తిడి, మధుమేహం రెండింటినీ అదుపులో ఉంచుతుంది.

Show comments