Capital’s Farmers Pension: రాజధాని ప్రాంతంలో తెల్లవారుజామునుండే పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. రాజధాని రైతు కూలీలకు రూ.3000 నుంచి రూ.5000 వేలకు పెన్షన్లు పెరిగాయి. ఇటీవల ఫిరంగిపురం సభలో రాజధాని రైతు కూలీలకు పెన్షన్లు పెంపుదల చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెరిగిన పెన్షన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చాలామంది రైతు కూలీలకు పెన్షన్ అందజేశారు.
ఇటీవలే ప్రభుత్వం రాజధాని రైతు కూలీలకు పెన్షన్లను పెంపుదల చేసింది. గతంలో ఇచ్చే రూ. 3000 రూపాయల నుండి ఏకంగా రూ. 5000 రూపాయలకు పెన్షన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ తెల్లవారుజామునుండే ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. తమకు పెరిగిన పెన్షన్లు పంపిణీ చేయడంతో రైతు కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.