NTV Telugu Site icon

Annamreddy Adeep Raj: పవన్‌ కల్యాణ్‌కు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

Adeep Raj

Adeep Raj

Annamreddy Adeep Raj: వైసీపీ అగ్రనాయకత్వంపై పవన్‌ కల్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. పవన్‌ కల్యాణ్‌ తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై, అలాగే స్థానిక ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలకు అన్నంరెడ్డి అదీప్‌ రాజ్ కౌంటర్ ఇచ్చారు. లక్షలమంది ఓట్లేసి గెలిపించిన నేనే ఆఫ్ట్రాల్ అయితే రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్‌ను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో రౌడీయిజం జరిగిందని కానీ టీడీపీ, జనసేన కేడర్‌పై ఎక్కడైనా దాడులు చేసినట్టు గానీ నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు.

Read Also: Peddireddy Ramachandra Reddy: ఈ పాపమంతా చంద్రబాబుదే.. అనుభవించక తప్పదు..

అధికారంలోకి రాక ముందే బీసీ వర్గీయుల ఇళ్ళ కు వెళ్లి మరీ జనసేన కేడర్ దాడులు చేసింది నిజం కాదా.. పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ చెప్పుడు మాటలు, తప్పుడు స్క్రిప్టు పెట్టుకుని తన మీద అసత్య ఆరోపణలు చేశారని అదీప్‌ రాజ్‌ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ హైట్, వెయిట్‌లో సగం కూడా లేని నన్ను చూసి మీరు ఎందుకు భయపడాలని అని అన్నారు. ప్రజలకు చేసే మంచి చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పవన్ కల్యాణ్‌ పరిమితం అయ్యారని ఆయన విమర్శించారు. జనసేన పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు ఇల్లీగల్ క్వారీల ద్వారా రోజుకి 6లక్షలు సంపాదిస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో విమర్శలు చేసింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఇల్లు కట్టాలంటే అదీప్ రాజుకు ఎవరు డబ్బులు ఇవ్వాలని నిరూపించండి చూద్దామంటూ ఛాలెంజ్ చేశారు.