Site icon NTV Telugu

Pemmasani Chandrashekar: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో పెమ్మలసాని చంద్రశేఖర్ ప్రచారం

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌ను బరిలోకి దిగిన విషయం విదితమే.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నుంచి కూడా అపూర్వ స్వాగతం లభిస్తోంది.. ఇక, ఎన్నికల ప్రచారంలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్‌.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం జగన్‌ వైఫల్యాలపై విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని.. మిత్ర పక్షాలకు చెందిన అభ్యర్థులకు విజయాన్ని కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. గుంటూరు లోక్‌సభ పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో పెమ్మలసాని చంద్రశేఖర్ రోడ్‌ షో నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీడీపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ రోడ్‌ షోలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

Read Also: Kakarla Suresh: ‘పల్లె పల్లెకు కాకర్ల’ కార్యక్రమానికి అపూర్వ స్పందన

Exit mobile version