Site icon NTV Telugu

Peddi: ‘పెద్ది’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ విపరీతమైన బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు సెకండ్ సాంగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్‌లో వీరిద్దరిపై ఒక భారీ సాంగ్‌ను షూట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ పాటలో చరణ్ తనదైన గ్రేస్ ఫుల్ స్టెప్పులతో అదరగొట్టనుండగా, జాన్వీ కపూర్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని టాక్.

Also Read : The Paradise : నాని ‘ప్యారడైజ్’ నుంచి మ్యూజికల్ ట్రీట్ అప్పుడేనా!

ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, మ్యూజిక్ పరంగా ఈ సాంగ్ ఒక సెన్సేషన్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బుచ్చిబాబు మార్క్ విలేజ్ డ్రామాకు రెహమాన్ క్లాసిక్ టచ్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ తన గత చిత్రాల కంటే చాలా భిన్నంగా, రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందట. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, కథలో కూడా మంచి లోతు ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవల్లో మారిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వెండితెరపై సందడి చేయనుంది. రామ్ చరణ్ డ్యాన్స్, జాన్వీ అందం, రెహమాన్ మ్యూజిక్.. ఈ మూడు కలిస్తే ‘పెద్ది’ సెకండ్ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.

Exit mobile version