Peddi: ‘పెద్ది’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ .. విపరీతమైన బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు సెకండ్ సాంగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్‌లో వీరిద్దరిపై ఒక భారీ సాంగ్‌ను షూట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ పాటలో చరణ్ తనదైన గ్రేస్ ఫుల్ స్టెప్పులతో అదరగొట్టనుండగా, జాన్వీ కపూర్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని టాక్.
Also Read : The Paradise : నాని ‘ప్యారడైజ్’ నుంచి మ్యూజికల్ ట్రీట్ అప్పుడేనా!
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, మ్యూజిక్ పరంగా ఈ సాంగ్ ఒక సెన్సేషన్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బుచ్చిబాబు మార్క్ విలేజ్ డ్రామాకు రెహమాన్ క్లాసిక్ టచ్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ తన గత చిత్రాల కంటే చాలా భిన్నంగా, రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందట. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, కథలో కూడా మంచి లోతు ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవల్లో మారిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వెండితెరపై సందడి చేయనుంది. రామ్ చరణ్ డ్యాన్స్, జాన్వీ అందం, రెహమాన్ మ్యూజిక్.. ఈ మూడు కలిస్తే ‘పెద్ది’ సెకండ్ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!