Peddi: ‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..

Peddi

Peddi

Peddi: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ “పెద్ది”. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా ‘పెద్ది’ మూవీపై మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినిమాలకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే పెద్ది కెప్టెన్(డైరెక్టర్) బుచ్చిబాబు సానా పుట్టినరోజు వేడుకలను సినిమా సెట్స్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఆ టైంలో ఈ చిత్ర డైరెక్టర్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

READ ALSO: AI ఫీచర్లతో Nissan Gravite లాంచ్‌.. తక్కువ ధరలో 7 సీటర్‌ కారు..

పెద్ది సినిమాలో కీలక పాత్ర చేస్తున్న శివ రాజ్ కుమార్ డైరెక్టర్ బుచ్చిబాబుకి బర్త్ డే సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. తాజాగా బుచ్చిబాబు.. శివరాజ్‌కుమార్‌తో కలిసి దిగిన పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కు సినిమాను కంప్లీట్ చేసి థియేటర్స్‌లోకి తీసుకురావడానికి చిత్ర బృందం కష్టపడుతుంది. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రూపొందున్న పెద్ది ఈ ఏప్రిల్ 30న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్‌లోకి రాబోతుంది.

READ ALSO: Healthy Breakfast: మధుమేహం, అధిక బరువుకు చెక్.. నిమిషాల్లో తయారయ్యే ‘ఓట్స్ ఆమ్లెట్’ను ఇలా ట్రై చేయండి!