NTV Telugu Site icon

Gaddam Vamshi Krishna: గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదు..

Gaddam Vamshi Krishna

Gaddam Vamshi Krishna

Gaddam Vamshi Krishna: గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన కాంగ్రెస్ జెండా వదలని ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కన్నుమూస్తానని కాకా చెప్పారని.. వచ్చిన తెలంగాణను కేసీఆర్‌ సర్వనాశనం చేశారన్నారు. నిరుపేదలకు పట్టాలు ఇచ్చి గుడిసెలు వేయించిన ఘనత కాకా వెంకటస్వామి.. నిరుపేద ప్రజలతో గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందిన ఘనత కాకాదని పేర్కొన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తూటాలకు కాకా వెంకటస్వామి ఎదురు నిలిచారన్నారు.

Read Also: CM Revanth Reddy: పదేళ్లు ఏమీ చేయని బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఎందుకు ఓటేయాలి..?

తెలంగాణను చూసిన తరువాతే కాకా కన్నుమూస్తానని చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి వెంకటస్వామి కన్నుమూశారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వచ్చిన తెలంగాణను గత ప్రభుత్వం అప్పులపాలు చేసిందని విమర్శించారు. 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు. మీ ఆశీస్సులతో గెలిపిస్తే ఇంటికి చిన్న కొడుకుల పని చేస్తానని ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రజలకు సూచించారు.

Show comments