Site icon NTV Telugu

Kollywood : మిరాయ్ కి చుక్కలు చూపిస్తున్న కోలీవుడ్

Kollywood (2)

Kollywood (2)

హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కింద పురి డేట్‌కు షిఫ్టై ఆ టీంకి ఝలక్ ఇచ్చింది. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కానీ ఇంచుమించు 10 సినిమాలను దాటుకుని నిలబడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్స్ త్రీ చోటా ఫిల్మ్స్ కాంపిటీషన్‌ను తట్టుకోవాలి.

డీఎన్ఎతో రీసెంట్లీ డీసెంట్ హిట్ అందుకున్న అధర్వ నుండి వస్తోన్న నెక్ట్స్ ఫిల్మ్ తనల్. దీన్ని తెలుగులో టన్నల్ పేరుతో డబ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న తనల్ సెప్టెంబర్ 12న తమిళంలో రిలీజ్ కాబోతుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ బ్లాక్ మెయిల్ మూవీ కూడా ఇదే డేట్‌పై కర్చీఫ్ వేసింది. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తున్నాయి. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ యాక్టర్ అర్జున్ దాస్ హీరోగా నటిస్తోన్న అప్ కమింగ్ ఫిల్మ్ బాంబ్. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా తీర్చిదిద్దిన బాంబ్ ఈ ఫ్రైడేనే థియేటర్లలోకి రాబోతుంది. ఇక వీటితో పాటు కుమార సంభవం, కాయల్, యోలో, మధురై 16, ఉరుత్తు ఉరుత్తు లాంటి చిన్న చితకా చిత్రాలు ఓ పది ఉన్నాయి. ఈ చిన్న సినిమాలను తట్టుకుని మిరాయ్ నిలబడాలి. చోటా సినిమానా, భారీ బడ్జెట్ అయినా.. చివరికీ కంటెంట్ కీలకం కాబట్టి.. తమిళ ఆడియన్స్ తేజ సజ్జాకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారో.

Exit mobile version