Mehbooba Mufti: జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో రిగ్గింగ్.. మెహబూబా ముఫ్తీ ఆందోళన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PDP Chief Mehbooba Mufti: ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతంలోని 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే, జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్- రాజౌరీ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన పీడీపీ (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) అధినేత మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగింది. తన పార్టీ కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లను కారణం లేకుండా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా తన సెల్ ఫోన్లో అవుట్ గోయింగ్ కాల్స్ బంద్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అనంత్ నాగ్-రాజౌరీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది.
Read Also: Loksabha Elections : కొన్ని చోట్ల పాడైపోయిన ఈవీఎంలు.. ట్యాంపరింగ్ ఆరోపణలు
Also Read
కాగా, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. అంతకు ముందు పీడీపీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను పోలీసులు స్టేషన్ కు తీసుకున్నారని ముఫ్తీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. మరోవైపు, నేటి ఉదయం 9 గంటల వరకు 10.82 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 16.54 శాతం, అత్యల్పంగా ఒడిశాలో 7.43 శాతం పోలింగ్ నమోదు అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Anantnag, J&K: PDP chief and candidate from Anantnag–Rajouri Lok Sabha seat, Mehbooba Mufti says, "…They are lying. They have been given the responsibility to rig the elections… This is just to induce fear in the minds of the people so that the Kashmiris don't come… https://t.co/5tZ7uigSNv pic.twitter.com/yh0vEd0yda
— ANI (@ANI) May 25, 2024
తాజావార్తలు
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్‌కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!