Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సీజన్ కోసం సీనియర్ పురుషుల జట్టు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఈ కాంట్రాక్టులు 2027 జూన్ 30 వరకు అమల్లో ఉంటాయి. గతంలో ఉన్న కేటగిరీ విధానాన్ని తొలగించి, ఈసారి ఫార్మాట్ ఆధారిత విధానాన్ని తీసుకొచ్చారు. మొత్తం 38 మంది ఆటగాళ్లకు చోటు కల్పించగా, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌తో సహా 13 మంది ఆటగాళ్లను జాబితా నుంచి తప్పించారు. ఇంగ్లండ్ సిరీస్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు చెప్పారనే ఆరోపణలు రిజ్వాన్‌పై వచ్చాయి. అలాగే ఈసారి ఏ ఒక్క ఆటగాడికీ మూడు ఫార్మాట్ల కాంట్రాక్టు లభించకపోవడం గమనార్హం.
రిజ్వాన్‌తో పాటు గతంలో బి కేటగిరీలో ఉన్న సైమ్ అయూబ్, హసన్ అలీ కూడా జాబితాలో లేరు. మాజీ కెప్టెన్ షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, నోమన్ అలీ, హుస్సేన్ తలత్, ఖుర్రమ్ షెహజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ కూడా స్థానం కోల్పోయారు. బాబర్ ఆజమ్, సల్మాన్ అలీ ఆఘాలకు టెస్టు, వన్డే కాంట్రాక్టులు దక్కాయి. ఇటీవల టెస్టు కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టిన బాబర్ నేతృత్వంలో పాకిస్తాన్ రెండు ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలిచింది. టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సల్మాన్ ఆఘాకు ఇప్పుడు టీ20 కాంట్రాక్టు లేదు.
Also Read
- Nitish Setu: గంగానదిపై "నితీశ్ సేతు"ను ప్రారంభించిన మోదీ!
- Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
- Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
- Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
అజాన్ అవైస్, సౌద్ షకీల్, మహ్మద్ అబ్బాస్, సాజిద్ ఖాన్లకు టెస్టు కాంట్రాక్టులు ఇచ్చారు. అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హాస్, ఫఖర్ జమాన్, ఫహీమ్ అష్రఫ్, హారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రిదిలకు వన్డే, టీ20 కాంట్రాక్టులు లభించాయి. టీ20 కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్‌తో పాటు హసన్ నవాజ్, మాజ్ సదాకత్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్లకు టీ20 కాంట్రాక్టులు దక్కాయి. మరో 19 మంది యువ ఆటగాళ్లకు డెవలప్మెంట్ కాంట్రాక్టులు ఇచ్చారు. వీరిలో తయ్యబ్ ఆరిఫ్, ఘాజీ ఘోరీ, ఉబైద్ షా, హునైన్ షా వంటి వారు ఉన్నారు.
తాజావార్తలు
-
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
-
Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
-
Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
-
Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
-
Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!