NTV Telugu Site icon

T20 World Cup 2024: జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. రిటైర్మెంట్‌ తీసుకున్న ఆటగాళ్లకు చోటు!

Pakistan Squad

Pakistan Squad

Pakistan confirm T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచక‌ప్‌ 2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది. మెగా టోర్నీలో పాక్ జట్టును బాబ‌ర్ ఆజమ్ నడిపించనున్నాడు. స్టార్ పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంల‌కు జ‌ట్టులో చోటు దక్కడం విశేషం. ప్రదర్శన, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టు ప్రకటనను పీసీబీ ఆలస్యం చేసిన విషయం తెలిసిందే.

ఐర్లాండ్‌, ఇంగ్లండ్ సిరీస్‌లో పాకిస్తాన్ జ‌ట్టులో భాగమైన ఆల్ రౌండర్ సల్మాన్ అలీ అఘా, ఫాస్ట్ బౌలర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌ల‌ను ప్రపంచ‌క‌ప్‌న‌కు ఎంపిక చేయ‌లేదు. పాక్ బౌలింగ్ భీకరంగా ఉంది. మహ్మద్ అమీర్, షాహీన్ అఫ్రిదీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీంలతో పటిష్టంగా ఉంది. బాబ‌ర్ ఆజమ్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్లతో బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. అయితే పీసీబీ రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. జూన్‌ 1 నుంచి ప్రపంచకప్‌
ప్రారంభం కానుండగా.. జూన్‌ 9న భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్ ఉంది.

Also Read: Rajasthan Royals: అదే మా ఓటమిని శాసించింది.. చాలా బాధగా ఉంది: సంజూ శాంసన్

పాకిస్తాన్ జ‌ట్టు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్‌.

Show comments