Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Pbks Vs Rr Marcus Stoinis Powers Punjab Kings To 222 Sets Massive Target For Rajasthan Royals

PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

Published Date :April 28, 2026 , 9:32 pm
By Kothuru Ram Kumar
  • పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు
  • టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన PBKS
  • రాజస్థాన్ ముందు 223 పరుగుల భారీ లక్ష్యం..
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

PBKS vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు మరోసారి వారి బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ మెరుపు దాడితో రాజస్థాన్ బౌలర్లు విలవిలలాడారు.

పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు ధాటిగా ప్రారంభించారు. ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు చేసి అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బాధ్యతాయుతంగా ఆడాడు. ప్రభ్‌సిమ్రాన్ 44 బంతుల్లో 59 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్సర్) చేసి జట్టుకు అవసరమైన పరుగులను అందించాడు. మధ్యలో కూపర్ కానోలీ (30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) తమ వంతు సహకారం అందించారు.

Also Read

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..

అయితే అసలైన వినోదం మార్కస్ స్టోయినిస్ బ్యాట్ నుండి మొదలైంది. క్రీజులోకి వచ్చిన క్షణం నుండే బౌండరీల వర్షం కురిపించిన స్టోయినిస్ కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ చివరి 5 ఓవర్లలో ఏకంగా 72 పరుగులు రాబట్టడం విశేషం. రాజస్థాన్ బౌలర్లు లో యాష్ రాజ్ పంజా 2 వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, నందరే బర్గర్ లు చెరో వికెట్ తీశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2026
  • Marcus Stoinis
  • PBKS
  • PBKS vs RR
  • prabhsimran singh

తాజావార్తలు

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions