టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందాల అనుబాంబ్.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఇక వరుస సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.. గత ఏడాది మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది..
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. ఇటీవలే ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు.. ఈ అమ్మడు మంగళవారం సినిమాతో చాలెంజింగ్ రోల్ ను కూడా చెయ్యగలదని నిరూపించింది.. ఇప్పుడు మరో సస్పెన్స్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది పాయల్.. పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది.. ఈ మూవీలో రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి సంగీతాన్ని అందిస్తున్నారు..