NTV Telugu Site icon

Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

పదేళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం లభించింది. గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున కొట్లాడారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా.. వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజల్ని తనను ఆదరించకపోయినా… రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు. మూడో సారి ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించాడు. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు పవన్ కల్యాన్. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది. కాగా.. 19వ తేదీన జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జనసేనాని పని తీరుపై ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

READ MORE: Action King Arjun : ప్రముఖుల సమక్షంలో వైభవంగా ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల రిసెప్షన్ వేడుకలు..

ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రులుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ సహా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపుపై ఉత్కంఠే కొనసాగింది. చివరకు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కీలక శాఖలు దక్కాయి. డిప్యూటీ సీఎం పదవితో పాటు.. ఆయనకు నాలుగు శాఖలు అప్పగించారు. కీలకమైన పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖకు అప్పజెప్పారు. జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలశాఖ, వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు.. అలాగే మంత్రి కందుల దుర్గేష్‌ కు పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు.