రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలోనే పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. అంతేకాకుండా.. భీమిలీ, యలమంచిలి, చొడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన కన్ను పడింది.
Chandrababu: ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుంది..
మరోవైపు.. GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 తో చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండర్ ను, సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాలను సంధించి విజయం సాధించిన పరంపరలో ఈ విజయం భారతదేశానికి మరో గర్వకారణంగా భావిస్తున్నానని తెలిపారు. ఇన్సాట్-3 డీఎస్ గా నామకరణం చేసి విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు.. మరెన్నో ఘన విజయాలు సాధించాలని నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతరిక్ష యవనికపై భారత జైత్ర యాత్ర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
JP Nadda: మోడీ హ్యాట్రిక్ ప్రధాని కావడం ఖాయం