NTV Telugu Site icon

Pawan Kalyan: పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తా..

Pawan Kalyan

Pawan Kalyan

ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీని గెలిపించింది..జనసైనికులే అని పేర్కొన్నారు. గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని జనసైనికులను ఉత్సాహ పర్చారు. జనసైనికులు ముందు పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి ఆఖరి శ్వాస వరకు కృషి చేస్తానని ప్రమాణం చూశారు. “పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తా. వ్యవస్థను నేను ఒక్కడినే మార్పు చేయలేను. పంచాయతీ అధికారులు సలహా కోరా. ఏఏ పనులు చేపట్టాలని.. జనాలను కోరితే 1423 ఆర్జీలు వచ్చాయి. కూటమికీ 21 ఎంపీ స్థానాలు ఇవ్వడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. గెలుపు కోసం మీరు పడ్డా కష్టం చూస్తే కన్నీరు వచ్చింది. మీకు సేవ చేయడానికి శక్తి ఇమ్మని దేవుడిని ప్రార్థిస్తున్నా. జనసేన లేని ఊరు ఉందేమోగాని..జనసైన్యం లేని ఊరు లేదు. సంతోషం వస్తే పొగుడుతారు.‌ కోపం వస్తే నన్నే తిడతారు. దేవుడని కాళ్ళు పట్టుకుని లాగేయకండీ.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: RACHARIKAM Movie: ఆర్జీవీ పోరి ఇలా అయ్యిందేంటి..? భయపెడుతున్న అప్సరా రాణి..

స్లోగన్లు ఇచ్చే పని అయిపోయింది అభివృద్ధి సాధించడమే తన ధ్యేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ..”నేడు రాష్ట్రం అంతా తిరిగే శక్తిని మీరే ఇచ్చారు. నా కుటుంబం నన్ను గెలిపిస్తుందనే విశ్వాసం ఉంది. నాకు భయం లేదు గట్టి వాడిని మొండి వాడిని..బాధ్యతగా ఉంటాను…. బాధ్యతగా వ్యవహరిస్తే ప్రాణం ఇస్తా. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేయకపోతే ఆంధ్రా రాష్ట్రం ఉండేది కాదు. గతంలో ఏవరు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని ఉండే వారు కాదు. పిఠాపురంలో గెలవకపోతే ఏమి చేయలేక పోయేవాడిని. ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజలకు నా కృతజ్ఞతలు. నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తా.” అని పవన్ పేర్కొన్నారు.