Pawan Kalyan Went to Megastar Chiranjeevi House: జనసేన పార్టీ స్థాపించిన తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపితో కలిసి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన్న తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందడమే కాదు తనతో పాటు మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అలాగే రెండు ఎంపీ స్థానాలు కూడా సాధించారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో సత్తా చాటడంతో ఆయన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు సినీ రంగం నుంచి మాత్రమే కాదు రాజకీయ దురంధరులు సైతం పవన్ కళ్యాణ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడంటూ కొనియాడుతున్నారు. ఇప్పటికే ఎన్ డి ఏ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే.
Navdeep: 23 ఏళ్లలో రకరకాల మనుషులను ప్రేమించా.. అలాంటి అమ్మాయే కావాలి: నవదీప్ ఇంటర్వ్యూ
అనంతరం మోడీతో కూడా భేటీ అయ్యారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. నిజానికి పవన్ కళ్యాణ్ గెలుపొందిన వార్త తెలిసిన రోజే మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. బిజీ షెడ్యూల్ నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన భార్య పిల్లల్ని తీసుకుని అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం కోసం ఆయన నివాసానికి వెళ్లారు. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ నివాసం దగ్గర ఉన్న పలువురు మెగా అభిమానులు బాణాసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక మెగా కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ ని సత్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా మీడియాకి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.