NTV Telugu Site icon

Pawan Kalyan: అపోలో ఆస్పత్రికి పవన్‌ కల్యాణ్‌.. డిప్యూటీ సీఎంకు వైద్య పరీక్షలు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు పవన్‌ కల్యాణ్‌.. ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు.. పవన్‌కు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు సూచించగా.. ఈ నెలాఖరునగానీ లేదా మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారట పవన్‌ కల్యాణ్‌.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి మొదలయ్యే ఏపీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు పవన్‌ కల్యాణ్‌.. శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరవుతారు.

Read Also: Off The Record: ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి ఎందుకు ప్రత్యేకం..?

మరోవైపు.. రేపు సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీకానున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఏపీ బడ్జెట్ పై అవగాహన కల్పించడంతో పాటు.. అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్‌ కల్యాణ్‌.. కాగా, పవన్‌ కల్యాణ్‌, గత కొంతకాలంగా బ్యాక్‌పెయిన్‌ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు.. ఆ మధ్య కేబినెట్‌ సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు.. ఇక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న సమయంలోనూ.. ఆయన ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకున్నట్టుగా.. కొన్ని మూలికలు కూడా తీసుకున్నట్టుగా ఆయన అనుచరులు పేర్కొన్న విషయం విదితమే.. అంతేకాదు, తాజాగా ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని.. ఇప్పటికీ వెన్న నొప్పి నన్ను తీవ్రంగా బాధిస్తోందని పవన్‌ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు.. కాగా, తాజాగా పవన్‌ కల్యాణ్‌ అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలను చేసుకున్న విషయాన్ని ఫొటోలతో సహా వెల్లడించింది జనసేన పార్టీ..