Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతోంది. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పవన్ మార్కు మేనరిజమ్స్ మరియు డైలాగులతో అభిమానులను అలరించినప్పటికీ బలహీనమైన కథనం మరియు పాతచింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్‌ప్లే కారణంగా డిజాస్టర్ దిశగా సాగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సంచలనం దృష్ట్యా ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లు సాధించినప్పటికీ రెండో రోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా రొటీన్ మాస్ ఫార్ములా మరియు కొత్తదనం లేని కథ ఈ చిత్రానికి పెద్ద మైనస్‌గా మారాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫలితం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలో ఆయన తన 33వ చిత్రాన్ని (PSPK 33) వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు దేవా కట్టాతో చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ వంటి సీరియస్ మరియు పొలిటికల్ థ్రిల్లర్స్ తీయడంలో దేవా కట్టాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.గతంలోనే పవన్ కళ్యాణ్ కోసం దేవా కట్టా ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేశారని, అది ఇప్పుడు పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఒక ఇంటెన్సివ్ డైరెక్టర్ మరియు పవర్ స్టార్ కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి పవన్ తో సినిమా ఓకే అయితే దేవా కట్ట ఎలాంటి జానర్ తో వస్తాడో చూడాలి.
Also Read
- Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
- Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
- State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
- AP Municipal Elections 2026: ఏపీలో 8.39 శాతం ఓటింగ్.. నగరిలో అత్యధిక పోలింగ్!
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
-
Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
-
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
-
AP Municipal Elections 2026: ఏపీలో 8.39 శాతం ఓటింగ్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!