Pawan Kalyan ‘The Real Yogi’ : మనిషిగా పుట్టాక పెరిగాం, జీవించం, చనిపోయామా అని కాకుండా ఒక లక్ష్యం ఉండాలని కోరుకున్నవాడు పవన్ కల్యాణ్ అని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్‌పై గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా జరిగింది. జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ్ బాబు గురించి ఏం మాట్లాడినా సొంత తమ్ముడు గురించి చెప్పినట్లు అనుకుంటారు. బుక్ రాసిన గణ ఒక కామన్ మెన్ పొయిట్ లో రాసాడన్నారు. తాను దేవుడిని నమ్మనని, కానీ నమ్మే వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తాను అన్నారు. కామ, క్రోధాలను అదుపులో పెట్టుకుంటే ఉన్నత స్థాయిలో కి వెళ్తారు.. పనన్ లాగా నేను ఒక్క రోజైనా ఉండగలనా అన్న ప్రశ్నను తనకు తానే వేసుకున్నారు నాగబాబు. పవన్ ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేదానిపై చాలా మంచి స్పీచ్ ఇచ్చాడని.. ఇవన్నీ కామన్ మెన్ కు ఇండాల్సిన లక్షణాలు కావని యోగి ఉండే లక్షణాలని నాగబాబు పవన్ కు కితాబిచ్చారు. తాను చిన్నప్పుడు పవన్ ను చాలా ఏడిపించానని అన్నారు.
Read Also: IRCTC Maharajas Express : మీరు రాజులైతేనే ఈ ట్రైన్లో ఎక్కాలి.. ఎందుకంటే టిక్కెట్ ధర రూ.19లక్షలు
పవన్ కళ్యాణ్ మోస్ట్ కంపర్టీబుల్. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండేవాడని.. టెన్త్ పాసయ్యాకే తనేంటో అర్థమైందని తన తమ్ముడు పవన్ గురించి నాగబాబు తెలిపారు. చిరంజీవి తమ్ముడు అయినంత మాత్రాన సినిమాలు ఎవరు ఇవ్వరని కష్టపడే తత్వం కావాలన్నారు. విలువలతో బ్రతకాలి అనుకున్న వాడు పవన్ కళ్యాణ్ అని.. ఏదైనా స్వచ్చంధ సంస్థ పెట్టుకుని సేవ చేసే కొద్దిమందికే చేరుతుంది. కోట్లాదిమందికి సేవచేయాలంటే రాజకీయాలే కరక్టని భావించి అందులోకి ఆరంగేట్రం చేసినట్లు నాగబాబు చెప్పారు. తన దగ్గర పిల్లల కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి జనసేన పార్టీ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. పదవే కావాలంటే బీజేపీలో చేరితే ఎప్పుడో మంత్రి పదవి దక్కేదని ఆయన అన్నారు. కానీ స్వాతంత్ర గా పార్టీ పెట్టుకొని, లంచగొండి, అవినీతి పరులను నిలదీయటానికి పార్టీ పెట్టాడన్నారు.ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బాబీ, మెహర్ రమేష్, తనికెళ్ళ భరిణి, నిర్మాత విశ్వ ప్రసాద్ హాజరయ్యారు.