Site icon NTV Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్

Pawan Kalyan Surendar Reddy

Pawan Kalyan Surendar Reddy

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ ఏడాది ఉగాది  కానుకగా ఈ చిత్రాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తి సంతృప్తిగా లేరని తెలుస్తోంది. రచయిత వక్కంతం వంశీ మరియు సురేందర్ రెడ్డి కలిసి సిద్ధం చేసిన కథాంశం పవన్ కళ్యాణ్‌కు మొదట్లో నచ్చినప్పటికీ, పూర్తి స్థాయి నేరేషన్  విషయంలో ఆయన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు సురేందర్ రెడ్డి పవన్‌ను కలిసి కథను వివరించినప్పటికీ, అందులో కొన్ని మార్పులు చేయాలని పవన్ సూచించారు.

Also Read : Siva Karthikeyan : వెంకట్ ప్రభు – శివకార్తికేయన్ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా

 పవన్ సూచించిన మార్పుల ప్రకారం సురేందర్ రెడ్డి టీమ్ స్క్రిప్ట్‌లో మార్పులు చేసినా, రీ-నేరేషన్ సమయంలో పవన్ ఇంకా సంతృప్తి చెందలేదు. దీంతో, మరోసారి స్క్రిప్ట్‌పై కూర్చుని, కథను మరింత పర్ఫెక్ట్ గా రెడీ చేయమని పవన్ స్పష్టం చెప్పారట. పవన్ కళ్యాణ్ ఈ ఫైనల్ నేరేషన్‌తో పూర్తిగా కన్విన్స్ అయిన తర్వాతే కాల్ షీట్లు ఇస్తానని చెప్పడంతో, ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీ స్క్రిప్ట్‌ను మెరుగుపరిచే పనిలో బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఏకైక కొత్త ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. మిగిలిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే ఆయన ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.

Exit mobile version