NTV Telugu Site icon

Pawan Kalyan: రెండుచోట్ల ఓడిపోయినా.. నన్ను నడిపించింది మీరే

Pawan 1

Pawan 1

పవన్ కళ్యాణ్ LIVE | Pawan Kalyan Public Meeting | Janasena | Ntv

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్యవేదిక సాక్షిగా మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భావం జరిగింది. పార్టీ పెట్టినప్పుడు నేను, అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. రాజకీయాలు నాకు తెలీదు.మా ఇంట్లో ఎవరూ పాలిటిక్స్ లో లేరు. గతంలో ఒక ప్రస్థానం చేసినా పరిస్థితులు తెలుసు. తెలంగాణ వచ్చాక ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాం. ఓట్లు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. కానీ వారికి ప్రయోజనం చేకూరాలి. ఎంతో ధైర్యం చేసి పార్టీ పెట్టాం. అసలే చీకటి, గాడాంధకారం ఉంది. అమృతం కురిసిన రాత్రిలో కవిత చదివారు.

సగటు మనిషికి మేలు చేయాలన్న తపన, అవగాహన తప్ప ఏం లేదు. పార్టీకి స్ఫూర్తి స్వాతంత్ర్య ఉద్యమ నేతలు. పింగళి వెంకయ్య గారి చరిత్రలో ఆయన ఆకలికి అలమటించి చనిపోయారన్న వార్త బాధేసింది. నేతాజీ గురించి మీ అందరికీ పూర్తిగా తెలీదు. బ్రిటిష్ వారు నేతాజీకి భయపడి స్వాతంత్ర్యం ఇచ్చారు. ఏపీ అవతరణకు పొట్టి శ్రీరాములు బలిదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన వల్ల ఏర్పడింది. మనవంతు కృషి చేద్దాం అని భావించా. రుద్ర వీణ సినిమాలో నువ్వు తినే ప్రతి మెతుకు సమాజం ఇచ్చింది. రుణం తీర్చుకునే టైం వస్తే తెప్పతగలేస్తావా అని రాశారు. మీరు గుండెల్లో పెట్టుకున్నారు. ఇంతమంది నా వెనుక ఉన్నారు. నా మొదటి అడుగు అసమానతలు, పేదలకు అండగా ఉండడమే పార్టీ లక్ష్యం అన్నారు పవన్ కళ్యాణ్.

ప్రతి చోట 500 మంది కార్యకర్తల్ని సంపాదించుకున్నాం. 6 లక్షలమంది క్రియాశీలక సభ్యుల్ని పొందాం, మనల్ని నమ్మి వెనక వస్తున్నారు. పదేళ్లలో మాటలు పడ్డాం.. జనం ఆశీస్సులతో ఒక రోజున జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ధర్మో రక్షతి రక్షిత అనేది నేను నమ్ముతాను. చట్టం అంటే ధర్మాన్ని నిలబెట్టడమే. వకీల్ సాబ్ లో అదే నమ్మా. ధర్మం కోసం ఉండాలి. నన్ను నడిపించేది ధర్మమే. జనసేన ప్రారంభించినప్పుడు 7 అంశాలను తెరమీదకి తెచ్చాం. అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణ పరిరక్షణ, కులాలను కలిపే రాజకీయాలు వంటి సిద్ధాంతాలను మనమంతా నమ్ముతున్నాం. మానవత్వాన్ని నిలబెట్టడం, సమాజంలో పరివర్తన రావాలి. అందమయిన శిల్పం రావాలంటే ఉలి దెబ్బలు తినాలి. ప్రతి ఓటమి మంచి విజయానికి నాంది కావాలి.

Read Also:Rahul Gandhi: కర్ణాటక ఎలక్షన్స్.. ఈ నెల 20న రాహుల్ గాంధీ పర్యటన

కమ్మ, కాపు, బీసీ కులాల గురించి మాట్లాడలేకపోయేవాడిని. కానీ ఇది సత్యం. పీడితుల పక్షాన నిలబడాలి. కులాల ఐక్యత అవసరం. కులాలను కలపాలి. కుల వృత్తుల మీద ఆధారపడ్డ సమాజం మనది. కులాలను విడదీస్తోంది. నేను ఏ కులంలో పుట్టాలో తెలీదు. కాపు కులంలో పుట్టాను. దానిని దాటిపోలేను. నా కులానికి నేను బందీని. రెల్లి సోదరులు, ముస్లిం, మైనారిటీ, బీసీ కులాలకు అండగా ఉండాలి. ఎవరినీ ద్వేషించకూడదు. విశాలంగా ఆలోచించాను. నన్ను కులం పేరుతో దూషిస్తారు. కులాన్ని అమ్మేస్తానంటే బాధగా ఉంటుంది. నేను విశ్వనరుడిని. అంతా బాగుండాలని కోరుకునేవాడిని. కులాల మధ్య చిచ్చుపెట్టలేను. అల్పసంఖ్యాక కులాలు బాగుండాలని భావించేవాడిని. 60 కి పైగా కులాలకు అన్నీ సమస్యలే. ఈ కులాల నుంచి మేధావులు వస్తారు. అలాంటిసమూహాన్ని నాయకులుగా చేయడానికి పార్టీ పెట్టాం. కుల కార్పొరేషన్లు పెట్టారు. అవి ఎందుకు ఉపయోగం లేదు. ఇలాంటివి మారాలి అన్నారు పవన్ కళ్యాణ్.

ఎస్సీ ఎస్టీ, కాపులు, బీసీలు సంఖ్యాబలం ఉన్నా దేహీ అనే పరిస్థితుల్లో ఉన్నారు. కులాల్లో ఉన్న అనైక్యత. మీరు ఐక్యత సాధిస్తే మీరు రిజర్వేషన్లు మీరే తెచ్చుకుంటారు. మీరు స్వతంత్రంగా ఉండగలుగుతారు. అలాంటి కులాలకు మేం అండగా ఉంటాం. మీరు బయటకు రండి.. కలిసి పోరాడండి. ఒక కులం పెత్తనం ఆగిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లో.. దీనికి అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం రావాలి. మీరు జనసేన పాలన తేవాలి. అగ్రకులాలకు కూడా రిజర్వేషన్లు కావాలి. అగ్రకులంలో పేదల గురించి ఆలోచించాలి. గంజి అన్నం తాము తిని పిల్లలకు కూరలు పెట్టారు. మంచి ర్యాంకులు వచ్చినా చదవలేకపోవడం చూశాం. ఇలాంటి అడ్డంకులు నేను చూశాను. నాకు ఈ దేశం అన్యాయం చేస్తోందన్నా బాధ ఉంది. అగ్రకులంలో పేదలకు అండగా ఉంటాం. స్కాలర్ షిప్పులు, ఫీజు రీఎంబర్స్ మెంట్ కి ప్రయత్నిస్తాం.

నేను ఎన్నోచోట్ల చూశాం. చదువుకోవాలంటే మేం పస్తులుండాలని రెడ్డి కులస్తులు కూడా నా ముందు ప్రస్తావించారు. రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు 150 కోట్లు ఖర్చుపెడతారు. గానీ పేదలకు 10 లక్షలు ఇవ్వలేరా? యువత జనసేనకు అండగా నిలబడితే మీకు అండగా నేనుంటాను.నాకు వెయ్యి కోట్లు ఆఫర్ చేశారట. డబ్బులతో నన్ను కొనలేరు. అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారని నన్ను విమర్శించారు. విదేశీ బ్రాండ్ కాదు నేను వేసుకున్న చెప్పులు. అవి ఇక్కడ తయారుచేసినవే. దాంతో కొడతా.. పళ్ళు ఊడిపోతాయి. నాకు డబ్బు అవసరం లేదు. నేను సినిమాకు 40 కోట్ల వరకూ చూసుకుంటాను.

మీరిచ్చిన స్థాయి ఇది. నేను సంపాదించుకోలేనా? ఒంటి పూట తింటాను. నేను టీడీపీ కోసం ఏ పార్టీ కోసం పనిచేయడం లేదు. వంగవీటి మోహనరంగా అంటే నాకు గౌరవం. ఆయనకు నేను టీ కూడా ఇచ్చాను. బతికున్నప్పుడు నాయకుడిని కాపాడుకోలేదు. చనిపోయాక ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏంటి? కులం విషయంలో ఎందుకీ అడ్డంకులు. కులాన్ని అమ్మేస్తానని అనడం బాధ కలిగిస్తోంది. కులం మీద సమాజాన్ని నడపలేం, మతం మీద సమాజం నడవదు. నేను కులం ఒకటే చూస్తే ఇంత పెద్ద నటుడిని కాగలనా? కాపులంతా నన్ను ఓటేసి గెలిపిస్తే ఎలా ఉండేది. వైసీపీ నేతల్ని టార్గెట్ చేశారు. నన్ను ఏ కులాన్ని గద్దెనెక్కించను. అన్ని కులాలను గౌరవిస్తాం. అగ్రకులంలో పుట్టావా, పేద కులంలో పుట్టావా అని ఆలోచించను. అందరికీ విద్య, వైద్యం కావాలని కోరుకుంటా. అది అందరికీ ఉచితంగా చేయాలి. ప్రతిభ ఉన్నవారికి అండగా ఉంటాం. కులాల ఉచ్చులో పడవద్దు. కులం చూసి ఓటు వేయవద్దు అన్నారు పవన్ కళ్యాణ్. బీజేపీతో అలయెన్స్ అంటే ముస్లిం సోదరులు, అక్కాచెల్లెళ్ళు నన్ను వదిలేస్తా అంటారు. మీమీద ఎలాంటి దాడులు జరిగితే నేను బయటకు వచ్చేస్తానని హామీ ఇచ్చారు.

Show comments