Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యేగా బాలరాజు పని తీరుపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పార్టీ దృష్టికి వచ్చిన పలు అంశాలు, ఆరోపణలపై ఎమ్మెల్యేను వివరణ కోరినట్లు సమాచారం. ఇంకా తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చక్కదిద్దుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే బాలరాజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, నాలుగు వారాల్లోగా అన్ని వ్యక్తిగత వ్యవహారాలను సరిచేసుకోవాలని గడువు ఇచ్చినట్లు తెలిసింది.
ఇక పోలవరం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల అభివృద్ధి పనులపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటివరకు అభివృద్ధి పనుల కోసం రూ.147 కోట్లు కేటాయించినట్లు పేర్కొంటూ, ఆ పనుల పురోగతిపై అధికారులతో పాటు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ముఖ్యంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
దీనికి స్పందించిన ఎమ్మెల్యే బాలరాజు.. అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని తెలిపారు. అలాగే వ్యక్తిగత వ్యవహారాలను కూడా త్వరలోనే చక్కదిద్దుకుంటానని హామీ ఇచ్చారు. వ్యక్తిగత అంశాలను సరిచేసుకునేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే బాలరాజు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?