Site icon NTV Telugu

Pawan Kalyan: వాలంటీర్లపై మరోసారి పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజే చెప్పా..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్లతోనే ఎంపీ మిలాఖత్‌ అయ్యారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ ఇంట్లో వాళ్లపై అఘాయిత్యానికి పాల్పడిన వాళ్లను చూసి భయపడతారేంటి..? డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసిన వాళ్లే ఇలా వ్యవహారస్తారు అంటూ మండిపడ్డారు.. ఈ వ్యవహారం ఎంపీ ఇంటికి పరిమితం కాదు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.

Read Also: Bharti Airtel MD Salary: కంపెనీ చైర్మన్ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగులు.. ఎన్ని కోట్లో తెలుసా?

సుజాత నగర్‌లో వాలంటీర్‌ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు పవన్‌ కల్యాణ్‌.. ఈ నెల 3న వాలంటీర్‌ వెంకటేష్ చేతుల్లో హత్యకు గురయ్యారు వరలక్ష్మి.. అయితే, హత్య జరగడానికి వారం ముందే వాలంటీర్‌ను విధుల నుంచి తప్పించినట్టు జీవీఎంసీ ప్రకటించిన విషయం విదితమే.. ఈ రోజు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు పవన్‌.. పాస్ పోర్టు కావాలంటే పోలీసు వేరిఫికేషన్ ఉండాలి. కానీ, వాలంటీర్ల నియామకంలో ఆ పద్ధతి ఎందుకు పాటించడం లేదు అని ప్రశ్నించారు పవన్‌.. నవరత్నాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్‌ సేన కావొచ్చు.. కానీ, జనం ప్రాణాలు తీసేస్తామంటే ఎలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదువు తప్పాయని ఆరోపించిన పవన్‌ కల్యాణ్‌.. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌.

Read Also: Married Woman: భర్తతో విడాకులు.. మరొకరితో సహజీవనం.. ఇంతలో ఊహించని ట్విస్ట్

వైసీపీ వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అంటూ మండిపడ్డారు పవన్‌ కల్యాణ్‌.. దండుపాళ్యం బ్యాచ్ కు వైసీపీ వాలంటీర్లకు తేడా లేకుండా పోయిందన్న ఆయన.. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారు అంటూ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్‌ చేతిలో హత్యకు గురైన కోటగిరి వరలక్ష్మి ఇంటికి వెళ్లి.. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి.. ఇంత కృరంగా హత్య చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఆరోజే నేను చెప్పాను ఒంటరి మహిళలే వారి టార్గెంట్‌ అంటూ వాలంటీర్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్‌.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version