మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరి మధ్యలో ఉండి మాట్లాడమని సీఎం సూచించారన్నారు. ఉద్యోగాలు వచ్చి కోర్ట్ లో కేసులు ఉండటం వల్ల ఆలస్యం అయ్యిందని తెలిపారు.…