నేడు మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే.. ఈనేపథ్యంలో ఇప్పటం గ్రామస్తులకు చెక్కుల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతతో నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరూ వెనకడుగు వేసిన సందర్భంలో ఇప్పటం గ్రామమే జనసేనకు అండగా నిలబడిందని, రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఇప్పటం గ్రామం ఇచ్చిందన్నారు. ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చిన వైసీపీ గడప కూల్చే వరకు పోరాటం చేస్తామని, రోడ్ల విస్తరణ చేస్తే అన్ని ఇళ్లు కూల్చాలి.. కానీ కొందరివే ఎందుకు కూల్చారన్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటం గ్రామస్తులు తెగువ అమరావతి ప్రజలు చూపించి ఉంటే.. అమరావతి వెళ్లేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ఇప్పటం గ్రామానికైన గాయానికి జనసేన మందు రాస్తుంది. ప్రజల గుండెల్లో స్థానం కంటే ఏ ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు.
Also Read : Ind vs Nz: రెండో వన్డే వర్షార్పణం.. 1-0 ఆధిక్యంలో కివీస్
వైసీపీ 30 ఏళ్ల అధికారంలో ఉండాలని కోరుకుంటే నేను 30 ఏళ్లల్లో ప్రజలు ఎదగాలని కోరుకుంటా. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు వెనుక డిఫ్యాక్టో సీఎం సజ్జల ఉన్నారు. అధికారం అంటే అహంకారం కాదని సజ్జల తెలుసుకోవాలి. రేపటి నుంచి నన్ను తిట్టిస్తారా నాపై దాడులు చేయిస్తారా చేయించుకోండి నేను బెదరను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వైసీపీ నేతల ఇళ్లూ కూలుస్తాం. లీగలుగా ఎలా కూల్చాలో మీరు చెప్పారుగా.. మేమూ లీగలుగానే చేస్తాం. కోడి కత్తితో గీకుంచుకుని రాజకీయ డ్రామాలు చేయటం వైసీపీ పని. వైసీపీకి సంస్కారవంతమైన రాజకీయాలు పని చేయవు. వివేకాను హత్య చేయించిన వారిని తమ వెనుక తిప్పుకుంటున్న వారు కూడా జనసేనను రౌడీ సేన అంటున్నారు. మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన. ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో మేం చూపిస్తాం. ప్రభుత్వం దృష్టిలో మేం రౌడీలమేమో కానీ.. ప్రజల దృష్టిలో మేం విప్లవ వీరులం. అనంతలో వైసీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో.. మీడియాలో చూస్తున్నా. వైసీపీ నేతలా..? వైసీపీ టెర్రరిస్టులా..? రాజకీయం మీరే చేయాలా..? మేం చేయకూడదా..? వైసీపీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం’ అంటూ ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.
