Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pawan Kalyan Launches Ramatheertham Giripradakshina Path Virtually In Andhra Pradesh

Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం..!

Published Date :March 25, 2026 , 6:51 pm
By Kothuru Ram Kumar
Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan: అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు సుమారు 3.70 కిలోమీటర్ల మేర ఈ గిరిప్రదక్షిణ మార్గాన్ని నిర్మించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల ద్వారా రూ.3.40 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. శ్రీరామ నవమికి ముందే భక్తులకు ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం రాళ్లు, ముళ్లతో నిండిపోయి ఉండేది. అయినప్పటికీ భక్తులు ఎంతో కష్టపడి ప్రదక్షిణ చేసేవారు. ఈ సమస్యలను స్థానిక ప్రజలు, ఎమ్మెల్యే లోకం మాధవి దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం స్పందించి, మార్గాన్ని సౌకర్యవంతంగా మార్చింది.

Modi-Trump: ట్రంప్‌కు మోడీ ఎందుకు గుర్తుకొచ్చినట్లు.? వెనక పాకిస్తాన్ కోణం..

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. గత 20 నెలల్లో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, ఇతర నిధుల ద్వారా రూ.40 కోట్లకు పైగా వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం గిరిప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, అలాగే కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గానికి రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు.

Telangana Assembly: ఆ సారా తాగడం వల్లనే 100 ఏళ్లు బతికారు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..

రామతీర్థం భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో రామాయణ, మహాభారత కాలానికి చెందిన ఆనవాళ్లు ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra politics
  • Andhra Pradesh temple development
  • ap tourism
  • giripradakshina
  • Hindu Temples

తాజావార్తలు

  • Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం..!

  • Modi-Trump: ట్రంప్‌కు మోడీ ఎందుకు గుర్తుకొచ్చినట్లు.? వెనక పాకిస్తాన్ కోణం..

  • Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..

  • UDAN Scheme 2.0: దేశంలో కొత్తగా 100 ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్స్..

  • Dhurandhar 2: ధురంధర్-2 క్లైమాక్స్‌ సాంగ్ వైరల్.. అసలెవరు ఈ “రాస్‌పుటిన్”, ఐఎస్ఐ అధికారి పాత్రతో సంబంధం ఏమిటి..?

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions