Telangana Assembly: ఆ సారా తాగడం వల్లనే 100 ఏళ్లు బతికారు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇప్ప పువ్వు వినియోగం, దాని ద్వారా గిరిజనులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ప్రసంగం సభలో ఆసక్తికర చర్చకు దారితీసింది. శాసనసభ వేదికగా మాట్లాడిన అనిరుధ్ రెడ్డి.. ఇప్ప చెట్టుకు సుమారు 5000 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న చీప్ లిక్కర్ వల్ల ప్రజలు 60 ఏళ్లు కూడా బతకలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన నియోజకవర్గంలోని గిరిజన తండాల్లో ప్రజలు ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారాను సేవించి.. 100 ఏళ్ల వరకు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారని వివరించారు. అంతేకాకుండా.. ఇప్ప పువ్వును టీలో కలిపి తీసుకోవడం వల్ల డయాబెటిస్ (చక్కెర వ్యాధి) అదుపులో ఉంటుందని శాస్త్రీయ కోణాన్ని సభ ముందు ఉంచారు.
Also Read:Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ వసూళ్ల గర్జన.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌కు!
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ఇప్ప పువ్వును కేవలం సారా తయారీకే పరిమితం చేయకుండా.. ఆధునిక పద్ధతుల్లో ఐస్‌క్రీమ్‌లు, కేకులు, లడ్డూలు, బిస్కెట్ల వంటి ఆహార పదార్థాల తయారీలో వాడాలని ఆయన సూచించారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలే చొరవ తీసుకుని శిక్షణ, యంత్రాలను అందిస్తున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ‘మాండ్’ అనే ఇప్ప డ్రింక్ బాటిల్‌ను రూ. 800కు విక్రయిస్తూ భారీగా ఆదాయం గడిస్తున్న విషయాన్ని ఉదాహరణగా చూపారు.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..