జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘హెల్త్ ఆన్ అస్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి వద్దే ఫిజియోథెరఫీ, నర్సింగ్ సేవలు, ట్రీట్మెంట్ తరువాత చేసే వైద్య సేవలు చేయనుంది హెల్త్ ఆన్ అజ్ సంస్థ.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరూ బాగుండాలి అని కోరుకునే వాడినని అన్నారు. అందరికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలని కోరుకునే వాడినని తెలిపారు. సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తానని చెప్పారు. ‘హెల్త్ ఆన్ అస్’ యాప్ వెనుక ఎంతో కృషి ఉందని.. ఇలాంటివి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని.. వైద్య నిపుణులంతా కలిసి ఈ యాప్‌ని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కల్యాన్ చెప్పారు.
Bank Holidays: మార్చి నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే!
తనలాంటి వ్యక్తి చేయగలిగేది.. అందరికి తెలిజేయడమని అన్నారు. హెల్త్ కేర్ ఎట్ హోమ్ అనేది కరోనా కేర్ లో చూశానని పవన్ కల్యాణ్ తెలిపారు. మొదటి సారి మెడికల్ కేర్ కు సంబంధించిన ఈవెంట్ కు వచ్చానని అన్నారు. చాలా మంది డాక్టర్స్ చదువుతున్నారు కానీ డాక్టర్స్ కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. కొన్ని సార్లు హాస్పిటల్ లో బెడ్ కావాలంటే మంత్రుల రికమండేషన్ కావాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కొవిడ్ తర్వాత ఇంటివద్దే మెడికల్ కేర్ కావాలనుకుంటున్నారని.. జనాభా పెరుగుదలతో పాటు మెడికల్ కాలేజీలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ యాప్ మెడికల్ కేర్, డాక్టర్స్‌ని ఇంటికి తెస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
MS Dhoni: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధోనీ టికెట్ కలెక్టర్ అపాయింట్‌మెంట్ లెటర్..
