Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో పవన్ సినిమా ఉంటుందని, భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అని గట్టిగా నమ్మారు. కానీ, 2026 నూతన సంవత్సర కానుకగా వచ్చిన అధికారిక ప్రకటనతో సీన్ మొత్తం మారిపోయింది. అభిమానుల అంచనాలకు భిన్నంగా, పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనికి
READ ALSO: రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో Kia Seltos 2026 భారత్‌లో లాంచ్.. ఏ మోడల్ ఎంత ధరంటే..?
ఒకటి రెండు సినిమాలు వర్కౌట్ కాకున్నా లోకేష్ కనగరాజ్ ‘LCU’ క్రేజ్ దృష్ట్యా, పవన్ కళ్యాణ్‌ను ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో అని మెజారిటీ ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే, సురేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి గత చిత్రం ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆయన ప్రస్తుతం ఫామ్‌లో లేరన్నది నెటిజన్ల వాదన. పవన్-లోకేష్ కాంబినేషన్ సెట్ అయితే అది పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసేదని, సురేందర్ రెడ్డితో ఆ రేంజ్ హైప్ రావడం కష్టమని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు. 2021లోనే నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ ఈ కాంబినేషన్‌ను ప్రకటించారు. రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నారని, ఆయన కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను వక్కంతం వంశీ సిద్ధం చేశారని సమాచారం. ‘కిక్’, ‘రేసు గుర్రం’, ‘ధ్రువ’ వంటి సినిమాలతో తనకంటూ ఒక స్టైలిష్ మేకింగ్‌ను క్రియేట్ చేసుకున్న సురేందర్ రెడ్డికి ఇది లైఫ్ అండ్ డెత్ లాంటి ప్రాజెక్ట్. పవన్ వంటి మాస్ హీరో దొరకడంతో, తనను తాను నిరూపించుకోవడానికి ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘OG’ (ఓజీ) సీక్వెల్,, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ దశలో సురేందర్ రెడ్డితో సినిమా అంటే, అంచనాలను అందుకోవడం ఆయనకు పెద్ద సవాలే. సురేందర్ రెడ్డి తన ట్రేడ్ మార్క్ స్టైల్ అండ్ యాక్షన్‌తో పవన్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌ను సురేందర్ రెడ్డి తన మేకింగ్‌తో మెప్పిస్తారా? లేక పవన్ కళ్యాణ్ నిర్ణయంపై భయం పెట్టుకున్న పవన్ ఫ్యాన్స్ అంచనాలే నిజమవుతాయా? అనేది వేచి చూడాలి.
READ ALSO: Health Tips: షుగర్ పేషెంట్స్ ఖాళీ కడుపుతో ఏం తింటే మంచిదో తెలుసా..
