నేడు ఏలూరు నుంచి రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్‌లో జనసేన వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఉదయం మంగళగిరి నుంచి ఏలూరు చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.. పోటీ ఒంటరిగానా ..? పొత్తు లోనా అనేది తేలడానికి చాలా సమయం ఉందని, పొత్తులు ఉంటాయో ఉండవో తేలే వరకు పార్టీలో ఎవరూ దాని గురించి మాట్లాడ వద్దని తెలిపారు. పొత్తులపై అధ్యయనం చేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, వైసీపీనీ ఓడించడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని గతంలో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : Building Collapse: బ్రెజిల్‌లో కుప్పకూలిన భవనం.. ఇద్దరు చిన్నారులు సహా 14 మంది మృతి
ఇప్పుడు అధ్యయనం చేశాకే పొత్తు లేదా ఒంటరి పోటీ తెలుస్తానన్నారు పవన్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని అవివేకం తో మాట్లాడటం లేదని, అధికారంలోకి రావాలనే ఆశ ఎవరికి ఉండదు? అందరికి ఉంటుందన్నారు. నా సందేశం కొన్ని కోట్ల మంది ప్రజల్లోకి బలంగా వెళ్తోందని, అందులో లోపం లేదన్నారు. కానీ కింది స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకునే, పోరాట పటిమ, స్ఫూర్తి ఉన్న బలమైన నాయకత్వం జనసేనకు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. నా పర్యటనల తర్వాత అక్కడ పరిస్థితులపై సర్వే చేయిస్తున్నామని, మెజార్టీ పేరుతో ఏసు క్రీస్తు ను శిలువ వేశారు, సోక్రటీస్ ను అదే మెజార్టీ పేరుతో చంపేశారన్నారు. ఏపీలో రూల్ ఆఫ్ లా నాశనం అయ్యిందన్నారు పవన్. ఇదిలా ఉంటే.. మహంకాళమ్మ చల్లగా చూడాలని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు సందర్భంగా భక్తులందరికీ భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పవన్. ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలను తల్లి మహంకాళమ్మ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Mark Zuckerberg Security: మార్క్ జుకర్‌బర్గ్ భద్రతకు ‘మెటా’ చేసిన ఖర్చు రూ.355 కోట్లా…