NTV Telugu Site icon

Pawan Kalyan: 2019లో పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఆలోచించాను..

Pawan

Pawan

పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నుంచి జనసేనలోకి వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక, పిఠాపురంలో మిథున్ రెడ్డి బాగా తిరుగుతున్నారటగా అంటూ పవన్ సెటైర్లు వేశారు. కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం నుంచి గతంలోనే పోటీ చేయాలని చాలా మంది ఆహ్వానించారు.. కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాన్నారు. 2019 లోనే పోటీ చేయమంటే నేను ఆలోచించాను.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే పిఠాపురం ప్రత్యేకమైనది అని ఆయన చెప్పుకొచ్చారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Read Also: Prince William: మాజీ మోడల్ మాయలో విలియం పడ్డారా? ఎఫైర్‌పై క్లారిటీ!

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని భావించేవాడిని అని జనసేన ఛీప్ పవన్ అన్నారు. గాజువాక, భీమవరం, పిఠాపురం మూడు నియోజకవర్గాలు నాకు మూడు కళ్లు.. నా గెలుపు కోసం ఆలోచన చేయకుండా.. రాష్ట్రం కోసం నేను ఆలోచన చేశాను.. శ్రీపాద శ్రీ వల్లభుడి కటాక్షంతో మనకి మంచే జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని నా స్వస్థలంగా మార్చుకుంటాను.. నేను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఇక నుంచి పిఠాపురం నుంచే ఏపీ భవిష్యత్ దశ దిశ మార్చేలా చేస్తాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Read Also: India Growth: భారత వృద్ధి 8 శాతం పైమాటే.. ఆర్బీఐ కథనం..

బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని నన్ను అడిగింది అనే విషయాన్న పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంపీగా పోటీ చేస్తారా..? లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని అడిగారు.. ఎమ్మెల్యేగానే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాను.. ముందు రాష్ట్రం, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని చెప్పా.. నా కోసం త్యాగం చేసిన ఉదయ్ ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నాను.. వందల కోట్లు పెట్టి నన్ను ఓడించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. అందరి ఆశీస్సులుంటే జగన్ లక్ష రూపాయలిచ్చినా ఏం కాదు.. 2009లో వంగా గీత పీఆర్పీ నుంచే గెలిచారు అని ఆయన తెలిపారు. దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు.

Read Also: Raw Mango: పచ్చిమామిడి తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..!

పిఠాపురాన్ని ఏపీలో ఆదర్శ నియోజకవర్గం చేద్దాం.. ఇక్కడ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే తలచుకుంటే అభివృద్ధి ఎలా చేయొచ్చో చూపిస్తాను అని తెలిపారు. ఎంతటి తీవ్రమైన సమస్యనైనా తగ్గించటానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఈ సమాజాన్ని కలిపే వ్యక్తిని, విడదీసే వ్యక్తిని కాదు.. మీ అందరి సహకారం, దీవెనలు కావాలి.. వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దని కోరుతున్నాను.. అలాంటి వారు జనసేనకు ఓటేస్తే ఉపయోగపడుతుంది అని జనసేన ఛీప్ పవన్ చెప్పుకొచ్చారు.