గత కొద్ది రోజులుగా బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో అనేక వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఆమె కోమాలో ఉన్నారని కొందరు.. నయం కాని రోగం వచ్చిందంటూ మరికొందరు వదంతులు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ బ్రిటన్ రాజకుటుంబం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఈ మధ్య బ్రిటన్ మాతృదినోత్సవం సందర్భంగా కేట్ మిడిల్టన్.. తన పిల్లలతో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అది ఎడిట్ చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పారు.
తాజాగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. తన స్నేహితురాలు, మాజీ మోడల్ రోజ్ హాన్‌బరీతో ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తు్న్నాయి. కేట్ అదృశ్యం కారణంగానే విలియమ్.. ఈ సంబంధం పెట్టుకున్నారని వదంతులు వ్యాప్తి చెందాయి. రోజ్ హాన్‌బరీ.. బ్రిటన్ యువరాణిగా రాబోతున్నారంటూ నెటిజన్లు కోడై కూస్తున్నారు.
ప్రిన్స్ విలియమ్‌తో ఎఫైర్ వార్తలపై తాజాగా రోజ్ హాన్‌బరీ స్పందించింది. ఎఫైర్ వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. ఆ వదంతులు పూర్తిగా తప్పు అని కొట్టిపారేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది.
ఇదిలా ఉంటే కేట్ మిడిల్టన్ శస్త్రచికిత్స అనంతరం కోమాలోకి వెళ్లిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఆమెకు సర్జరీ జరిగినట్లుగా బ్రిటన్ రాజకుటుంబం అధికారికంగా వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. ఎంత శస్త్ర చికిత్స జరిగినా.. వారం పది రోజుల్లో కనిపించాలి కదా? ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తు్న్నారు. ఇక విలియమ్ కూడా ఎక్కడికెళ్లినా ఒంటరిగానే కనిపిస్తు్న్నారు. దీంతో ప్రజల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. మాజీ మోడల్‌తో ఎఫైర్ కారణంగానే కేట్ కనిపించడం లేదని వార్తలు వ్యాప్తి చెందాయి.
రోజ్ హాన్‌బరీ కూడా బ్రిటన్ రాజకుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలోనే జన్మించింది. ఆమెకు విలియం, కేట్‌తో మంచి స్నేహ సంబంధం ఉంది. వారి నివాసాలు కూడా సమీపంలోనే ఉన్నాయి. దీంతో వీరంతా తరచూ కలుసుకుంటూనే ఉంటారు. అయితే రోజ్ హాన్‌బరీ- విలియం మధ్య ఎఫైర్ ఉందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు తొలిసారిగా 2019లో వ్యాప్తి చెందాయి. అప్పటి నుంచి ఈ వార్తలకు చెక్ పడటం లేదు. ఇప్పుడు కేట్ అదృశ్యం వేళ మరోసారి వీరి ఎఫైర్ అంశం తెరపైకి రావడంతో నెటిజన్లంతా కేట్ కనిపించకుండా పోవడానికి విలియం-రోజ్ అఫైరే కారణం అంటూ చెప్పుకుంటున్నారు. ఈ వార్తలకు చెక్ పడాలంటే రాజ కుటుంబం నుంచి ఒక క్లారిటీ వస్తేనే గానీ.. ఒక ముగింపు పడదు. లేదంటే రోజుకో పుకారు వస్తూనే ఉంటుంది.
ఇది కూడా చదవండి:Kodela Sivaram: టీడీపీని వీడాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు..