NTV Telugu Site icon

Chandrababu: నెల్లూరులో గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కల్యాణ్

Cbn

Cbn

పవన్ కళ్యాణ్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నారని.. నెల్లూరులో గల్లీ.. గల్లీ తిరిగిన వ్యక్తని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. “నాకు తిరుపతిలో గల్లి గల్లి తెలుసు పవన్ కళ్యాణ్ కు నెల్లూరులో అంతా తెలుసు. సింహపురిలో చరిత్ర తిరగ రాయబడుతుంది. టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే ఎవరైనా ఉంటారా. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం. ప్రజలకు బంగారు భవిష్యత్ చూపించడం మా బాధ్యత. సింహపురిలో ప్రజా స్పందన అనూషంగా ఉంది రాష్ట్రమంతా ఇలానే ఉంది. 25 కు 24 లేదా 25 లోక్ సభ సీట్లు.. 160 అసెంబ్లీ సీట్లలో గెలుస్తున్నాం. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల గెలుపు ఓటములకు సంబంధించినది కాదు తెలుగు..జాతికి సంబంధించినది. రాతియుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయి. ఉద్యోగస్తులంతా తమ వైపు ఉండాలి. రెండో సంతకాన్ని జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం పెడతా. నెల్లూరులో ముస్లింలు తరలి రావడం అభినందనీయం.”

READ MORE: KTR Road Show: సికింద్రాబాద్‌ నుంచి పద్మారావు గౌడ్‌కు 60 వేల మెజార్టీ ఇవ్వాలి..

టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎవరికీ అన్యాయం జరగలేదని చంద్రబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “ముస్లిమ్స్ కు నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడుతాం. మక్కాకు వెళ్లే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం. మౌజాం..ఇమామ్ లకు 5 వేల మేర గౌరవేతనమిస్తాం. రాష్ట్రంలో ఓట్లు చీలకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందుకే ప్రజల కోసం సీట్ల సర్దుబాటు చేసుకున్నాం. రాష్ట్రంలో వన్ సైడ్ అయింది. టీడీపీ అధికారంలోకి వస్తే సంపద ను సృష్టించి మరింత మెరుగైన సంక్షేమాన్ని ఇస్తాం. ఆడబిడ్డలకు నెలకు రూ.15 వందల చొప్పున ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చే బాధ్యతను తీసుకుంటాం. ఉద్యోగం వచ్చేవరకూ రూ.3 వేల మేర నిరుద్యోగ భృతిని ఇస్తాం. పింఛన్ ను రూ.4 వేల రూపాయలకు పెంచుతాం. దివ్యాంగులకు రూ. 6 వేలకు పింఛన్ ను పెంచుతా. కాపుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 15000 కోట్లను టీడీపీ పెట్టింది. స్కిల్ సెన్సస్ చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ను సినిమాలో నటించేందుకు శిక్షణ కోసం చిరంజీవి పంపించారు. విద్యారంగంలో ఒక బ్రాండ్ ను నారాయణ సృష్టించారు. వేమిరెడ్డికి ఎ2 విజయ్ సాయి రెడ్డికి ఏమైనా పోలిక ఉందా. జగన్ చూసిన అరాచకాలు చూసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చారు. నెల్లూరుకు విమానాశ్రయాన్ని తీసుకువస్తాం. నెల్లూరు వాళ్ళు ప్రపంచమంతా రాణిస్తున్నారు.”