కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దెబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టజీవులైన కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలి అని జనసేనా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరుతున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు. రహదారి భద్రతా చర్యలపై రవాణా, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి అని జనసేనాని చీఫ్ పవన్ తెలిపారు.
Also Read : RCB vs RR: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ఆర్ఆర్ లక్ష్యం ఎంతంటే?
కాగా.. తాళ్లరేవు ఘోర రోడ్డు ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. సీడ్ కంపెనీలో పనిచేస్తున్న 14 మంది మహిళ కార్మికులతో వెళ్లుతున్న ఆటోను మోజో ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిందని ఆయన వెల్లడించారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 6గురు కార్మికులు అక్కడక్కడే మృతి చెందారు.. మృతులంతా మహిళలే.. మరో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు ఎస్పీ తెలిపారు.
Also Read : Double Ismart: ఈ అనౌన్స్మెంట్ కోసమే వాళ్లు నాలుగేళ్లుగా వెయిటింగ్
వీరిలో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఆటో, బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. బస్సు డ్రైవర్ వేగంగా రావడమే ప్రమాదానికి కారణం అని తెలిపారు. ఆటోలో 14 మందిని ఎలా ఎక్కించుకున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆటో ప్రయాణిస్తున్న వారంతా యానాం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే కావడం గమనార్హం.