Site icon NTV Telugu

Pawan Kalyan: తప్పు చేస్తే ఎవరినైనా నిలదీయాలి

Pawan 1

Pawan 1

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా నిలదీయాలన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లానుపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. సబ్ ప్లాన్ విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంపై చర్చ జరిగింది. సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నా చిన్నప్పట్నుంచి నెల్లూరు జిల్లాలో పెరిగాను.యానాదుల అవస్థల గురించి ప్రత్యక్షంగా చూశాను.. బాధపడ్డాను.జై భీమ్ అనే పదం నా గుండెల్లో నిలిచిపోయింది.చట్టాలు చేయడం కాదు.. ఆచరణలో చేసే మనస్సున్న మనిషి కావాలి.వ్యక్తి ఆరాధన మంచిది కాదు.నేను తప్పు చేస్తే నన్నూ నిలదీయాలి.బ్రిటీష్ ఎయిర్ వేస్ లో దగ్గర నేనూ వివక్షకు గురయ్యాను.నాకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఓ బ్రిటీష్ మహిళ నిరాకరించింది.మాకు గౌరవం ఇవ్వడం ఇష్టం లేకుంటే మా దేశంలో మీ ఎయిర్ వేస్ నడపొద్దని చెప్పాను.

Read Also: Ashok Khemka: 8 నిమిషాల పని.. 40 లక్షల జీతం.. వద్దంటోన్న ఐఏఎస్ ఆఫీసర్

పైలెట్ వచ్చి నాకు సారీ చెప్పారు.ఓ వ్యక్తికి శిరోముండనం చేస్తే.. ఆ సామాజిక వర్గంలో అందరికీ కోపం వస్తుంది.శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి.ఎవరి జనాభా ఎంతుందో.. దానికి తగ్గట్టుగా బడ్జెట్ ఉండాలి.సాధికారత కల్పించడం పాలకులకు ఇష్టం ఉండదు.దేహీ అంటేనే ఇస్తారు.. కానీ పోరాటంతో సాధించుకోవాలి.రాజధాని భూ సమీకరణ సమయంలో అసైన్డ్ రైతులకు న్యాయం చేయగలిగాం.పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములున్న దళితులకు న్యాయం జరిగేలా చూశాం.దేని కోసం సబ్ ప్లాన్ నిధులు వినియోగించాలో.. దానిని సంపూర్ణంగా అమలు చేస్తాం. సీఎం అయ్యాక.. నేను దాన్ని అమలు చేయలేకుంటే నన్ను నిలదీయవచ్చు అన్నారు పవన్ కళ్యాణ్.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని రూ. 21500 కోట్లు పక్కదారి పట్టాయి.ఆ నిధులే ఉంటే.. దళితులు ఎంతో అభివృద్ధి చెందుతారు.ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై పర్యవేక్షణకు పార్టీ తరపున ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం.ఆత్మకూరు గ్రామ ముఖ ద్వారానికి జ్యోతిబా పూలే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ ద్వారం అని పేరు పెట్టారు.ముఖద్వారానికి కూడా వైఎస్ పేరు పెట్టాలా..?వైఎస్ చాలా మంచి పనులే చేశారు.. కానీ జ్యోతిబాపూలేతో పోలికా..?ఇలా ప్రతి విషయంలోనూ పోలికలు పెట్టడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు..? కౌలు రైతులు ఆత్మహత్యలకు నష్టపరిహరం ఇవ్వడం లేదు.

నష్టపరిహరంలోనూ కోతలు విధిస్తున్నారు.కౌలు రైతులకు సాయం చేసేందుకు మేం వెళ్తున్నామని తెలిసి.. రూ. 7 లక్షలివ్వాల్సింది.. రూ. 5 లక్షలు ఇస్తున్నారు.ఇటీవల గుంటూరులో ఓ రెల్లి కులస్తునికి దక్కాల్సిన నష్టపరిహారాన్ని పూర్తిగా ఇవ్వలేదు.బీజేపీతో నేను ఉన్నానంటే కొంత మంది దూరం అవుతున్నారు.నేను ప్రధానిని కలిస్తే నా గురించి ఏం మాట్లాడను.ప్రజా సమస్యల గురించే నేను ప్రధాని దగ్గర మాట్లాడతాను.నేను బీజేపీ దగ్గరయ్యానని నాకు దూరం జరగొద్దు.. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి.నేను ఎవరితో ఉన్నాననేది అనవసరం.ప్రజలకు మేలు జరగడమే ముఖ్యం.నేను తప్పు చేస్తే నన్ను నిలదీయండి.

Read Also: Millet Year 2023: చక్కని ఆరోగ్యానికి తృణధాన్యాలే ఆధారం

Exit mobile version