Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉదారతను చాటుకున్నారు. ఇటీవల ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందజేసన జనసేన పవన్ కళ్యాణ్. శుక్రవారం విశాఖలో పర్యటించిన పవన్ ఈ సందర్భంగా మత్స్య కారులకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
‘వైసీపీతో సహా మిగిలిన రాజకీయ పార్టీల్లా నేను ఎప్పుడు మత్స్యకారులను ఓట్ బ్యాంకులా చూడలేదు. మీరు నాకు అన్నతమ్ముడి లాంటి వాడిని. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాను. తెలంగాణలో బీజేపీ, జనసేన ఎన్నికల్లో సమిష్టిగా వెళితున్నాయి. సీరియస్ కేంపైన్ ఆపి మీ కష్టంలో ఉన్నారనివచ్చాను. ఇక మిగిలింది నాలుగు నెలలు భరిద్దాం. ఛాన్స్ తీసుకో కూడదనే త్రిముఖ పోటీకి అంగీకరీంచడం లేదు. తక్కువ ఓట్లు తేడాతో ఒడిపోయాం అనే మాట వద్దు. కనీసం 25వేల ఓట్లతో గెలిచి నిరూపించాలి.
ప్రభుత్వాన్ని అంకుశంతో గుచ్చకపోతే మత్స్యకారులకు న్యాయం జరగదు. నేను ఇచ్చే పరిహారం మీ కష్టం తీరుస్తుందని కాదు.. ప్రభుత్వంను కదిలించేందుకే పరిహారం ప్రకటించాను. హార్బర్లో ప్రమాదానికి చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయి అనే సమాచారం ఉంది. ప్రస్తుతం ఉన్నది రూపాయి పావలా ప్రభుత్వం.. ఐదేళ్ల కాలంలో హార్బర్లో లైట్లు వేయలేకపోయారు….ఇక ఆధునికీకరణ మాట ఎక్కడా.. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎన్ని హార్బర్లు కట్టింది…. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయని వైసీపీ నేతలను నిలదీయండి. ఎప్పుడు ఆంధ్రాకి.. వైజాగ్ వద్దామన్నా ఈ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. పాలన మీద నమ్మకం ఉంటే ఎందుకు జనసేనను చూసి భయపడుతున్నారు. కాలిపోయిన బోట్లకు ప్రకటించిన పరిహారం పూర్తిగా చేరడం లేదు.
దానికి ఎవరు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సర్క్యూట్ హౌస్ వదిలేసి విలాసవంత మైన బిల్డింగ్‌లు ఎందుకు? ఆ పెట్టుబడితో ఒక హార్బర్ కట్టొచ్చు కదా. కుళ్లును కడిగేసేందుకు నేను సిద్ధం…. అందుకు మీ సహకారం కావాలి. మనస్ఫూర్తిగా నన్ను నమ్మండి బాధ్యత తీసుకుని పని చేస్తాను. సంపద జగన్‌గారి కుటుంబానికి కాదు.. అందరికీ చేరాలి. నేను మత్స్యకారులకు అందజేసిన పరిహారం ఎవరి నుంచి దోచింది కాదు.. పార్టీ విరాళాలు రూపంలో వచ్చినవే. జనసేన, టీడీపీ ప్రభుత్వం రాబోతోంది. .వైసీపీ మహమ్మారిని తరిమేద్దాం’ అని పవన్ పిలుపు నిచ్చారు.