Pawan Kalyan: జనసేన టీడీపీకి బీ టీమ్ అనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు, మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైసీపీ వాళ్లు జనసేనని బీ టీం అంటుంటే.. బయటి వాళ్లు అనడం వేరు .. మనవాళ్లు అనడం వేరు అంటూ జనసేన నాయకులకు ఆయన సూచించారు. బయటి వాళ్ల కంటే జనసేన నాయకులు నమ్మకపోవడం చాలా ఇబ్బంది అని.. మనవాళ్లు నన్ను సందేహిస్తారని పవన్ అన్నారు. రాజకీయాల్లో ప్రలోభాలు ఉంటాయని.. వాటిని దాటుకుని వెళ్లడమే నైతిక రాజకీయమన్నారు. సోషల్ మీడియాలో లేదా నేరుగా జరుగుతున్న దాడికి ఎదురు దాడి చేయడం నేర్చుకోవాలని జనసేన నాయకులకు పవన్ సూచించారు.
Also Read: Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తల పూజలు.. కౌంట్ డౌన్ స్టార్ట్
2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించానన్న పవన్.. అప్పటికి రాజకీయ పార్టీ ప్రారంభం కాలేదని తెలిపారు. తర్వాత మొదలైన పార్టీని జాతీయ పార్టీలో కలిపేస్తే తాను ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లలేదన్నారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మితే చచ్చే వరకు అది కొనసాగించడమేనని.. పార్టీని నడపడానికి వేల కోట్లు ఉంటే సరిపోదన్నారు. ఐదేళ్లకొకసారి సిద్ధాంతాలు మార్చుకునే పార్టీ జనసేన కాదంటూ పవన్ వ్యాఖ్యానించారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలతో పని ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ను జగ్గు భాయ్ అని పవన్ సంభోదించారు. జగ్గు భాయ్ ఆంధ్రప్రదేశ్ మనదనే భావనలో ఉన్నారని.. త్వరలోనే ఆ భావన తీసేస్తామన్నారు. సగటు భారతీయుడు, సగటు తెలుగువాడిలో దైర్యం పోయిందని.. ఉదాసీనత పెరిగిపోయిందని ఆయన అన్నారు. తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష పడాలన్నారు. తాను విడాకులు ఇచ్చినా తన పెళ్లిల్ని జగన్ వదలలేదని.. జగన్ పట్టించుకోవాల్సింది పాలసీల గురించి అని ఆయన పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
నవరత్నాలు అంటే కెమెరాలు పెట్టడం తప్ప ఇంకేం లేదని విమర్శించారు. మధ్యతరగతి మనసు నుంచి ఇంకా బయటికి రాలేదని.. మధ్యతరగతి మనసు తనకు ఇష్టమని పవన్ తెలిపారు. కోటి రూపాయలు ఎవరికైనా ఇచ్చేస్తాను.. నాకోసం పదివేలు ఖర్చు పెట్టుకోవాలంటే పది సార్లు ఆలోచిస్తానన్నారు. నన్ను, నా వాళ్ళను అంటే నాకు కోపం రాదన్న పవన్.. పోలీస్ అధికారి జనసేన నాయకుల్ని చెంప దెబ్బలు కొడితే కోపం వస్తుందన్నారు. జన సైనికులపైన పోస్టులు పెడితే కోపం వస్తుందన్నారు. రాజశేఖర్ రెడ్డి ఇష్టానుసారం సంతకాలు పెట్టారని, ఆయనను అందరూ దేవుడన్నారని పవన్ తెలిపారు. ఆయన వల్ల అంతమంది ఐఏఎస్ అధికారులు జైలులో ఎందుకు ఉన్నారని పవన్ ప్రశ్నించారు. ఆయన అక్రమాలు చేశారని పవన్ ఆరోపించారు. ఆయన జేబులో డబ్బులు కాదు.. కొడుక్కి కూడా డబ్బులు ఇచ్చారన్నారు. ఆయన కొడుకు సీఎం అయ్యారు ఐఏఎస్ జైల్లోకి వెళ్లారని పవన్ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం మారిన రోజున కొత్త చట్టాలు వస్తే డిజిటల్ ప్రొటెక్షన్ బిల్లు ఆధారంగా తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు.
