ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం?గుంటూరు జిల్లాకు చెందిన సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను తప్పుగా నమోదు చేయడమే కాకుండా.. తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ల పాటు తిప్పుకోవడం దారుణం అన్నారు పవన్.
Read Also: CM Jagan: గృహనిర్మాణ శాఖపై కీలక సమీక్ష
రెవెన్యూ వ్యవస్థ తీరుతో విసిగే ఆంజనేయులు బలవన్మరణానికి పాల్పడ్డారని, రైతుల సమస్యలను పరిష్కరించలేని వ్యవస్థలు.. గ్రూప్ వన్, ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండి ఏం లాభం?అని మండిపడ్డారు పవన్. గుంటూరు కలెక్టర్ దగ్గరకు పురుగుల మందు డబ్బాపట్టుకొని వెళ్ళి మరీ తన గోడు చెప్పుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. ఆంజనేయులు మరణానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.