Ustaad Bhagat Singh: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేకర్స్ క్రేజీ అప్డేట్ వదిలేరు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట విషాల్ దద్లాని వాయిస్‌తో “దేఖ్ లేంగే సాలా” అంటూ సాగింది. ఈ క్రేజీ సాంగ్‌ను భాస్కరభట్ల రాశారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
READ ALSO: Top 5 Electric Cars: 2026 లో విడుదల కానున్న టాప్ 5 EVల జాబితా ఇదే.. ఒక లుక్ వేయండి
ఈ సినిమాకు సంబంధించిన తొలి పాట ‘దేఖ్లేంగే సాలా’ లిరికల్ వీడియో ప్రమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోమో కొన్ని సెకండ్ల పాటే ఉన్నా ఇందులో పవన్ స్టైల్, దంచికోట్టే డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 13న రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నిజానికి డీఎస్పీ – పవన్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటే యూత్‌లో క్రేజ్ పీక్స్‌లో ఉంది. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. అదే మాస్, అదే ఎనర్జీ, అదే ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి ఈసారి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తో వస్తారని పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. మొత్తానికి ‘దేఖ్ లేంగే సాలా’ అంటూ సాగిన ఈ ప్రోమో సినిమా మీద హైప్‌ను మరింత రెట్టింపు చేసినట్లు అయ్యింది.
READ ALSO: Cricket Marriage Controversies: స్నేహం–వివాహం–వివాదం! స్నేహితుడి భార్యతో స్టార్ క్రికెటర్..