Top 5 Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోరు క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే టాటా వంటి బ్రాండ్లు బహుళ ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తూ, మరింత విస్తరణను ప్లాన్ చేస్తున్నాయి. కానీ ఇంకా మారుతితో సహా ఇతర పోటీ కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించలేదు. SUVలు ప్రపంచవ్యాప్త ఆకర్షణను సొంతం చేసుకుంటున్న క్రమంలో ఆటోమేకర్లు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. వాస్తవానికి ఇండియాలో ఆటోమేకర్లకు లభిస్తున్న ప్రోత్సాహం కూడా ఇందుకు విశేషంగా సాయం చేస్తుంది. అనేక మంది తయారీదారులు 2026లో కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు. 2026లో మార్కెట్‌లో లాంచ్ కాబోతున్న ఐదు టాప్ EV లు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Cricket Marriage Controversies: స్నేహం–వివాహం–వివాదం! స్నేహితుడి భార్యతో స్టార్ క్రికెటర్..
మారుతి సుజుకి ఇ విటారా
మారుతి e Vitara వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే మొదటి కొత్త EV అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ EVలకు సంబంధించి జనవరిలో అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ SUV రెండు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ఎంపికలతో మార్కెట్‌లోకి రాబోతున్నాయి. సింగిల్-మోటార్ సెటప్‌తో జత చేసిన 49 kWh యూనిట్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్న పెద్ద 61 kWh ప్యాక్‌తో వస్తుంది. చిన్న బ్యాటరీ 346 కి.మీ వరకు పరిధి కలిగి ఉంటుంది. అయితే 61 kWh ఎంపిక దీనిని 428 కి.మీ (WLTP) వరకు విస్తరిస్తుందని చెబుతున్నారు. అయితే, భారతదేశంలో AWD లాంచ్‌ను ఇంకా ధృవీకరించలేదు.
టాటా సియెర్రా EV
టాటా సియెర్రా ఈవీ మార్చి 2026 నాటికి మార్కెట్‌లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ICE వెర్షన్ షోరూమ్‌లలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇది కూడా అందుబాటులోకి వస్తుంది. ఆల్-ఎలక్ట్రిక్ సియెర్రా సింగిల్-మోటార్ రియర్-వీల్ డ్రైవ్, డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానుంది. ప్రారంభం నుంచి దాని ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ICE సియెర్రా నుంచి సూచనలను తీసుకుంటూ, EV ఫ్రంక్, వన్-పెడల్ డ్రైవింగ్, వెహికల్-టు-లోడ్ (V2L) ఇంకా అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తుందని భావిస్తున్నారు.
మహీంద్రా XUV 3XO EV
మహీంద్రా కంపెనీ XUV 3XO ఎలక్ట్రిక్ వెర్షన్‌పై పని చేస్తోంది. వాస్తవానికి ఇది టాటా నెక్సాన్‌కు గట్టి ప్రత్యర్థిగా చెబుతున్నారు. XUV400 కంటే చిన్నది, సరసమైనది కూడా. రాబోయే EV 35 kWh NMC బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని అంటున్నారు. ఇది సుమారు 400 కి.మీ.ల అంచనా పరిధిని అందిస్తుంది. మహీంద్రా ఈ కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ SUVని 2026 ప్రథమార్థంలో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తుంది.
కియా సియోర్స్ EV
భారతదేశంలో మార్చి 2026 నాటికి విడుదల కానున్న కియా సైరోస్ EV ఇటీవల మొదటిసారిగా పరీక్షలో కనిపించింది. ఇది ఎలక్ట్రిక్ సైరోస్ ICE వెర్షన్ డిజైన్‌కు దగ్గరగా ఉందని, ముందు కుడి ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్ వంటి EV-నిర్దిష్ట టచ్‌లతో ఉంటుందని స్పై షాట్‌లు వెల్లడించాయి. ముఖ్యంగా టెస్ట్ మ్యూల్‌లో ఆకుపచ్చ బ్రేక్ కాలిపర్‌లు ఉన్నాయి. ఇవి సాధారణంగా EV9 GT వంటి కియా పనితీరు మోడళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించాయి. క్యాబిన్, ఫీచర్లు ICE సైరోస్‌తో పంచుకునే అవకాశం ఉంది. సాంకేతిక వివరాలు వెల్లడించనప్పటికీ, ఇది టాటా నెక్సాన్ EV ప్రత్యర్థి హ్యుందాయ్ K1 ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుందని చెబుతున్నారు.
హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV
హ్యుందాయ్ కంపెనీ.. టాటా పంచ్ EVకి గట్టి పోటీని ఇచ్చే తన ఈవీని 2026 చివరి నాటికి భారతదేశంలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. HE1i అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV, స్థానికంగా లభించే ఎక్సైడ్ బ్యాటరీలతో శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. గ్లోబల్ ఇన్‌స్టర్ EV ఆధారంగా ఇది 97hp లేదా 115hp మోటార్‌లతో జత చేసి, 42kWh, 49kWh బ్యాటరీ ఎంపికలను అందిస్తుంది. అలాగే 300km, 355km WLTP లను కూడా తీసుకురాబోతుంది. డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, లెవల్ 2 ADAS, ఆటో క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్‌తో 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నట్లు సమాచారం.
READ ALSO: IndiGo: నార్మలైజ్ అంటే ఇదేనా?.. ఇండిగో సీఈఓ పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్