69th National Film Awards: జాతీయ సినిమా అవార్డులు.. అల్లు అర్జున్ సహా ఎవ్వరినీ వదలని పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
69th National Film Awards: 69వ జాతీయ సినిమా అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు దుమ్మురేపాయి.. వివిధ విభాగాల్లో ఏకంగా 10 అవార్డులను సొతం చేసుకున్నాయి.. సింహ భాగం.. ఆరు అవార్డులను ఆర్ఆర్ఆర్ మూవీ కైవసం చేసుకుంటే.. ఆ తర్వాత పుష్ప సినిమా రెండు అవార్డులను, కొండపొలం, ఉప్పెన చేరో అవార్డును దక్కించుకున్నాయి.. ఇక, అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జాతీయ సినీ పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు.. 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్న ఆయన.. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. సినిమా రూపకల్పనలో నిమగ్నమయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉంటున్నాయన్నారు.
ఇక, పుష్ప చిత్రానికిగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం అన్నారు పవన్ కల్యాణ్.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’, ఈ సినిమాకుగాను విజేతలుగా నిలిచిన కీరవాణి, కాల భైరవ, శ్రీనివాస మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలోమన్, ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులు.. ఇలా అందరికీ అభినందనలు తెలిపారు. మరోవైపు.. ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం సంతోషకరం అన్నారు జనసేనాని.. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి, దర్శకుడు సానా బుచ్చిబాబుకీ అభినందనలు తెలిపారు.
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
పలు విభాగాల్లో అవార్డులు కైవశం చేసుకోవడంతోపాటు బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’ని నిలిపిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్యలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు పవన్ కల్యాణ్.. శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని చూపిన ‘రాకెట్రీ’ చిత్రాన్ని ఉత్తమంగా నిలిపిన దర్శకులు, నటులు ఆర్.మాధవన్ అభినందనీయులు. ఉత్తమ నటీమణులుగా నిలిచిన అలియా భట్ (గంగూభాయ్), కృతి సనన్ (మిమి) ప్రశంసలకు అర్హులుగా అభివర్ణించారు. ఇక, ‘ద కశ్మీర్ ఫైల్స్’ ముఖ్యమైన అవార్డులు దక్కించుకొంది. ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి అభినందనలు అన్నారు. ఉత్తమ దర్శకుడిగా నిలిచిన మరాఠీ దర్శకుడు నిఖిల్ మహాజన్ (గోదావరి)కి ఉత్తమ గాయని శ్రేయ ఘోషల్‌కి, ఉత్తమ ఛాయాగ్రహకుడ ఆవిక్ ముఖోపాధ్యాయ్, హిందీ చిత్ర సీమ నుంచి అవార్డులకు ఎంపికైన సంజయ్ లీలా భన్సాలీ, పల్లవి జోషి, పంకజ్ త్రిపాఠీలు, వివిధ భాషల ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగాల నుంచి ఈ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!