NTV Telugu Site icon

Sarath Babu Passes Away: సీనియర్ నటుడు శరత్ బాబు మృతి.. సంతాపం తెలిపిన జనసేనాని

Sarath Babu, Film Actor, Passed Away, Janasena, Pawan Kalyan

Sarath Babu, Film Actor, Passed Away, Janasena, Pawan Kalyan

Sarath Babu Passes Away: టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న( ఆదివారం) ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. నేడు(సోమవారం) సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నేడు ఆరోగ్యం విషమించడంతో మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల కోలుకోలేక ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. శరత్ బాబు మరణ వార్తతో చిత్రసీమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read Also:Manik Rao Thakre : కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే పనులు ఎవరు చేసినా యాక్షన్ తీసుకుంటా

ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ ద్వారా శరత్ బాబుకు సంతాపం తెలిపారు. ఈ లేఖలో ..‘ ప్రముఖ నటులు శరత్ బాబుగారు తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్ర్భాంతికి లోనయ్యాను. కొద్ది రోజులుగా అనారోగ్యందో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబుగారు కోలుకుంటారని అనుకున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాకు శరత్ బాబు గారితో నాకు చెన్నైలో చిత్రపరిశ్రమ ఉన్నప్పటినుంచి పరిచయం ఉంది. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. వకీల్ సాబ్ చిత్రంలోనూ నటించారు. తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటన చూపించారు. కథానాయకుడిగానే కాక సహాయక పాత్రలో , ప్రతినాయకుడి పాత్రల్లో విభిన్న భావోద్వేగాలు పలికించారు. ఆయన మరణంతో చిత్రసీమకు మంచినటుడు దూరమయ్యాడు. శ్రీ శరత్ బాబు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

Read Also:Prabhas: దేవుడా.. ప్రభాస్ కు అంత పెద్ద ప్రమాదం జరిగిందా.. బస్సు కింద పడి

Show comments