Sarath Babu Passes Away: సీనియర్ నటుడు శరత్ బాబు మృతి.. సంతాపం తెలిపిన జనసేనాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarath Babu Passes Away: టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న( ఆదివారం) ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. నేడు(సోమవారం) సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నేడు ఆరోగ్యం విషమించడంతో మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల కోలుకోలేక ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. శరత్ బాబు మరణ వార్తతో చిత్రసీమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read Also:Manik Rao Thakre : కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే పనులు ఎవరు చేసినా యాక్షన్ తీసుకుంటా
Also Read
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
- భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ ద్వారా శరత్ బాబుకు సంతాపం తెలిపారు. ఈ లేఖలో ..‘ ప్రముఖ నటులు శరత్ బాబుగారు తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్ర్భాంతికి లోనయ్యాను. కొద్ది రోజులుగా అనారోగ్యందో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబుగారు కోలుకుంటారని అనుకున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాకు శరత్ బాబు గారితో నాకు చెన్నైలో చిత్రపరిశ్రమ ఉన్నప్పటినుంచి పరిచయం ఉంది. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. వకీల్ సాబ్ చిత్రంలోనూ నటించారు. తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటన చూపించారు. కథానాయకుడిగానే కాక సహాయక పాత్రలో , ప్రతినాయకుడి పాత్రల్లో విభిన్న భావోద్వేగాలు పలికించారు. ఆయన మరణంతో చిత్రసీమకు మంచినటుడు దూరమయ్యాడు. శ్రీ శరత్ బాబు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
Read Also:Prabhas: దేవుడా.. ప్రభాస్ కు అంత పెద్ద ప్రమాదం జరిగిందా.. బస్సు కింద పడి
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?