Pawan Kalyan: చిరంజీవి బర్త్ డే.. పవన్ ఎమోషనల్ పోస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరో.. ఏ నటుడు, ఏ దర్శకుడు, ఏ డ్యాన్సర్.. ఇలా ఏ సందర్భంలో మాట్లాడినా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించే మాట్లాడుతుంటారు.. ఆయన్ను సినిమాలు చూస్తూ పెరిగామని.. ఆయనను ఆదర్శంగా తీసుకొనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చామంటూ చెబుతుంటారు.. ఇక, మెగా హీరోలు మాత్రం.. చిరంజీవి మాట నోటి నుంచి రాకుండా.. ఎక్కడా మాట్లాడరు.. ముఖ్యంగా మెగా బ్రదర్స్ మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెబుతారు.. అన్నయ్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తమ్ముడు సీరియస్‌గా వార్నింగ్ ఇస్తాడు.. తమ్ముడు గురించి ఎవరైనా నోరు పారేసుకుంటూ.. అన్నయ్య సుతిమెత్తగా మందలిస్తుంటాడు.. ఇక, ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.. అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్.
Read Also: Renu Desai: ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పెట్టిన పోస్ట్ విషయానికి వస్తే.. “అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya ..!” అంటూ రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.
అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan@KChiruTweets#HBDMegastarChiranjeevi pic.twitter.com/ERu1BHiifr
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2023
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!