Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Fans Amalapuram: జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహిళా అభిమానులు వినూత్నంగా చేశారు. పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలు తమ ఇళ్ల ముందు ప్రత్యేకంగా రంగురంగుల ముగ్గులు వేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగలకు ఇళ్ల ముందు ముగ్గులతో శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా అదే తరహాలో ముగ్గులు వేయడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అమలాపురంలోని రవణం వీధిలో మహిళలు తమ ఇళ్ల వాకిట్లో రంగులతో ‘హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్’, ‘హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం’ అంటూ అందమైన ముగ్గులు వేశారు. రంగురంగుల డిజైన్లతో పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ముగ్గుల్లో పవన్ నటించిన పలు సినిమాల పేర్లను కూడా అందంగా పొందుపరిచారు. ‘బద్రి’, ‘జల్సా’, ‘ఓజీ’, ‘పంజా’, ‘బాలు’, ‘తొలిప్రేమ’ వంటి చిత్రాల పేర్లను ముగ్గుల చుట్టూ రంగులతో అలంకరించారు. దీంతో ఈ వినూత్నమైన ముగ్గులు స్థానికుల దృష్టిని ఆకర్షించడంతో పాటు పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తమకు ఒక పండుగ రోజు లాంటిదని అమలాపురం మహిళలు అంటున్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను ఎంత ఆనందంగా జరుపుకుంటామో.. పవన్ పుట్టినరోజును కూడా అంతే ఉత్సాహంతో జరుపుకుంటున్నామని చెప్పారు. ‘అమలాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అభిమానుల అడ్డా’ అని పేర్కొన్నారు. పవన్ మరింత ఉన్నత పదవులు చేపట్టి రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..