Patnam Narendar Reddy : ఆరు గ్యారంటీ ల గురించి అసెంబ్లీలో చర్చ సైడ్ ట్రాక్ మళ్లించేందుకే అల్లు అర్జున్ పై అనవసర చర్చ పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి పై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తప్పు పట్టారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యసాదింపులో భాగంగానే లగచర్ల కేసులో నాపై తప్పుడు కేసులు బనాయించి 37 రోజులు జైల్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారన్నారు. ప్రజా సంక్షేమం అంటూ అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అంటూ అమాయక ప్రజలను ఆకట్టుకొని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓట్లు వేసిన రైతులకు బీడీలు వేసిన ఘనత దేశంలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి కే చెల్లిందన్నారు.
తనను కూడా వాకింగ్ చేస్తూ ఉండగా ఏదో పెద్ద రౌడీని అరెస్టు చేసినట్లుగా వారెంటు లేకుండా తీసుకువెళ్లారన్నారు. లగచర్ల దాడిలో కేటీఆర్ చెప్పడం వల్లే ఇలా దాడి చేయించాను అంటూ తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా కేటీఆర్ ఇరికించే ప్రయత్నం చేశారన్నారని తప్పు పట్టారు. రిమాండ్ రిపోర్టు తనను చదవకుండానే అరెస్టు చేయించారంటూ జైలు నుంచే జడ్జి లెటర్ పంపించాను అన్నారు. పూటకు ఓ కేసు పెట్టి ఆరు గ్యారంటీల అమలును పక్కనపెట్టి అల్లు అర్జున్ చర్చను గంటన్నర పాటు కావాలని అసెంబ్లీలో చర్చించారన్నారు.
సినిమా ప్రివ్యూ షో తొక్కిసలాటలో ఓ మహిళ రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమే. కానీ ఈ సంఘటనకు థియేటర్ యాజ మన్యం పై కేసు నమోదు చేసి చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని తప్ప అనవసరంగా అల్లు అర్జున్ ఇరికించడం సరికాదన్నారు. బాధిత మహిళ చనిపోయిన రేవతికు కుటుంబాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కొడుకు వైద్య పరీక్షలు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ పై ఉందని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా అరెస్టులు, కేసులు పెట్టి రైతులకు బేడీలు వేయడం మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో పరిమాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.
Jani Master Case : జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు